జూనియర్ ఎన్టీఆర్ మామకు జగన్ మార్కు షాక్

Narne Srinivas rao joined ysrcp ys jaganజూనియర్ ఎన్టీఆర్‌ మామ నార్నె శ్రీనివాసరావు గత వారం లోటస్‌పాండ్‌కు వెళ్లి జగన్ సమక్షంలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ లో చేరారు. ఆయనకు పార్టీ అధ్యక్షుడు జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. తాను జగన్ ను సీటు ఇవ్వమని ఏమీ అడగలేదని పార్టీ అధికారంలోకి రావడానికి పని చేస్తా అని చెప్పుకొచ్చారు ఆయన. కాకపోతే పార్టీ పోటీ చెయ్యమంటే మాత్రం ఎక్కడ నుండైనా పోటీ చెయ్యడానికి సిద్ధమని ఆయన మీడియా ముందు అన్నారు.

ADVERTISEMENT

అయితే గుంటూరు పార్లమెంట్ నుండి గానీ, చిలకలూరిపేట అసెంబ్లీ నుండి గానీ టిక్కెట్టు ఇవ్వాల్సిందిగా ఆయన జగన్ ను కోరారని సమాచారం. పార్టీలో చేరాక ఇప్పుడు అద్దంకి నుండి పోటీ చెయ్యమని జగన్ ఆయనను ఒత్తిడి చేస్తుందని సమాచారం. అద్దంకిలో గొట్టిపాటి రవి చాలా గట్టి అభ్యర్థి ఆయన పై పోటీ అంటే ఓటమి కొని తెచ్చుకున్నట్టే. ఈ క్రమంలో నార్నే గొంతులో పచ్చి వెలగపండు పడినట్టు అయ్యిందంట. కాకపోతే ఇప్పటికే చాలా దూరం వచ్చేయడంతో వెనక్కు వెళ్ళలేని పరిస్థితి.

గత ఎన్నికలలో కూడా నార్నే వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ సెగ ఎన్టీఆర్ కు కూడా తగిలింది. గత కొద్ది కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న జూనియర్ ఉద్దేశపూర్వకంగానే మామను వైఎస్సాఆర్ కాంగ్రెస్ వైపునకు పంపారని ఆరోపణలు వచ్చాయి. అయితే వివాదాల కారణంగానో మారే కారణంగానో ఆయన రాజకీయ అరంగేట్రం ఆగిపోయింది. హరికృష్ణ హఠాన్మరణం అనంతరం ఎన్టీఆర్ నందమూరి కుటుంబానికి కాస్త దగ్గరయ్యారు.

ఆయనకు బాలయ్య కుటుంబానికి కొంత రాకపోకలు పెరిగాయి. అయితే ఆయన పార్టీకి మాత్రం దూరంగానే ఉంటున్నారు. ఇటీవలే ఆయన అక్క నందమూరి సుహాసిని కూకట్ పల్లిలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తే జూనియర్ ప్రచారానికి కూడా వెళ్ళలేదు. కేవలం ట్విట్టర్ లో మద్దతు ఇవ్వడంతోనే సరిపెట్టారు.ఇప్పుడు నార్నేకు అనుకూలంగా ప్రచారం చెయ్యాలని జూనియర్ మీద ఒత్తిడి ఉండడం సహజం. దీనితో ఆయనను కొత్త తలపోటు ఖాయంగా కనిపిస్తుంది. ఈ క్రమంలో ఎన్టీఆర్ ఏం చేస్తారో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories