ఇప్పుడు దేశంలో, రాష్ట్రంలో కరోనా కేసులు ఊపందుకుంటున్నాయి. కరోనా 2.0 అన్నట్టుగా ఇప్పుడిప్పుడే దేశంలో కరోనా విజృంభణ మొదలయ్యింది. అయితే గతంలో మాదిరి కరోనా ఇప్పుడు ప్రజలను, వ్యాపారస్తులను భయపెట్టగలదా అంటే బయపెట్టలేదు అనే సమాధానమే వినిపిస్తుంది.
మాస్క్ లు, శానిటైజర్లు, సోషల్ డిస్టెన్స్ వంటివి కొంత వరకు కరోనా వ్యాప్తి ని అరికట్టగలవు. ఒక వేళ కరోనా సోకినా ఒక వారం రోజులు క్వారంటైన్ లో ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే కరోనా ఎటువంటి హాని చేయకుండానే వచ్చినదారినే తిరిగి వెళ్లిపోయే అవకాశం ఉంది.
అలాగే కరోనా వాక్సిన్లు కూడా ప్రజలకు అందుబాటులో ఉండడంతో ఈసారి కరోనా 2.0 లా రూపం మార్చుకుని ప్రపంచం ముందు నిలుచున్నా దాన్ని చూసి ఎవరు భయపడే పరిస్థితి లేదు. ప్రభుత్వాలు లాక్ డౌన్ లు విధించలేవు, వ్యాపారాలు స్తంభించే పరిస్థితి లేదు.
అయితే గతంలో ప్రపంచాన్ని మొత్తం ఇంటి గడప దాటకుండా చేసిన ఇంతటి మహమ్మారిని చూసి కూడా ఇప్పుడు ఎవ్వరు భయపడడం లేదు కానీ, 2019 నుంచి 2024 వరకు ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైసీపీ ని చూసి మాత్రం అటు పారిశ్రామిక వేత్తలు, ఇటు రాజధాని ప్రజలు, అలాగే ఏపీలో ని సామాన్య మధ్యతరగతి సమాజం మొత్తం భయంతో వణికిపోతోంది.
తిరిగి వైసీపీ ఏపీలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అన్న భయం అన్ని రంగాల ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. వైసీపీ 2.0 తిరిగి ఏపీలో అడుగుపెడితే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఏంటి అన్న ప్రశ్న అందరిని తొలిచేస్తోంది.
ఒక బడా పారిశ్రామిక వేత్త రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలంటే వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తే.? ఒక ప్రముఖ విద్యా సంస్థ దాని క్యాంపస్ ను ఏపీలో స్థాపించాలి అంటే వైసీపీ తిరిగి వస్తే.? రాజధాని విస్తరణకు భూములు కావాలి అంటే అక్కడి ప్రాంత ప్రజలు మరో సారి వైసీపీ అధికారంలోకి వస్తే.?
పోలవరం నిర్వాసితులు…వైసీపీ కి మరో ఛాన్స్ వస్తే.? ఉపాధి కోసం ఎదురు చూస్తున్న యువత వైసీపీ 2.0 అధికారంలోకి వస్తే..? ఇలా నిత్యం పొట్ట చేత పట్టుకుని కూలి పని చేసుకునే సామాన్యుడి నుండి వేల కోట్ల సంపాదన ఉన్న బడా బడా వ్యాపార వేత్తల వరకు అందరిని వెనడతున్న భయం వైసీపీ 2.0.




