మహేష్ బాబుకు ఆవిడ కావాలంటే ఎన్టీఆర్ కు కూడా ఆవిడే కావాలా?

vijayashanthi-Mahesh Babu-Jr NTRఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన విజయశాంతి రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. దాదాపు 13 సంవత్సరాల గ్యాప్ తర్వాత మహేష్ బాబు హీరోగా రూపొందబోతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం ద్వారా ఆమె రీ ఎంట్రీ ఇస్తున్నారు. విజయశాంతి చివరగా 2006లో వచ్చిన పొలిటికల్ డ్రామా మూవీ ‘నాయుడమ్మ’లో కనిపించారు. ఈ సినిమా కోసం ఆమె జిమ్ కు వెళ్ళి కొంత బరువు తగ్గే పనిలో ఉన్నారట.

ADVERTISEMENT

మరోవైపు విజయశాంతి తన సెకండ్ ఇన్నింగ్స్ లో మరో సినిమా కూడా సైన్ చేసారని వార్తలు వస్తున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలు గా రాజమౌళి తీస్తున్న మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్ లో ఆమె ఒక చిన్న పాత్ర పోషించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ ను ఒక సన్నివేశంలో రెచ్చగొట్టే పాత్రలో ఆమె కనిపిస్తారట. అయితే ఈ వార్తలు ఎంతవరకూ నిజం అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు మరియు ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.

రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఎన్టీఆర్ సరసన నటించాల్సిన హాలీవుడ్ నటి డైజీ ఎడ్గర్ జోన్స్ సినిమా నుంచి తప్పుకోవడంతో ఆమె పాత్ర కోసం ఇంకా వేట కొనసాగుతుంది. జులై 30, 2020 తారీఖున విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తుంది చిత్ర బృందం. బాహుబలి లగే తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషలలో ఒకేరోజు విడుదల కాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్క్రీన్లలో విడుదల కాబోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

ADVERTISEMENT
Latest Stories