బ్యాక్ గ్రౌండ్ లో కబాలి… ఫోర్ గ్రౌండ్ లో బాహుబలి..!

2.0 Movie Audio Launch‘సూపర్ స్టార్’ రజనీకాంత్ తాజా చిత్రం “రోబో 2.0” పబ్లిసిటీ ఆకాశమే హద్దుగా సాగుతోందని చెప్పడంలో సందేహం లేదు. నిజంగా… ఆకాశాన్ని తాకే విధంగా ఫ్లైయింగ్ బ్యానర్ తో అదరగొట్టేసిన ‘రోబో 2.0’ యూనిట్ ఆడియో వేడుకకు సర్వం సిద్ధం చేసుకుంది. ఈ రేంజ్ పబ్లిసిటీ అనేది సినిమాపై ప్రేక్షకుల ఫోకస్ పడేలా చేసినప్పటికీ, ఒక్కోసారి ఈ అతి పబ్లిసిటీ వలన జరిగే లాభం కంటే నష్టమే ఎక్కువన్న విషయం ‘సూపర్ స్టార్’ గత చిత్రమే చెప్తోంది.

రజనీ నటించిన “కబాలి” సినిమాకు ఏ రేంజ్ లో పబ్లిసిటీ చేసారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏకంగా విమానాలపై ‘కబాలి’ పోస్టర్లు ముద్రించి, సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు. కేవలం రజనీకి మాత్రమే సాధ్యపడే రీతిలో కనిపించిన ఆ మేనియా, సినిమా విడుదల తర్వాత ఎక్కడా లేకపోవడం తెలిసిందే. సినిమాలో విషయం లేకుండా హంగామా చేస్తుంటే… దారుణ పరాజయాలను చవిచూడాల్సి వస్తోందన్న విషయం తెలియనిది కాదు.

ADVERTISEMENT

అలాగే కధలో దమ్ముండి పబ్లిసిటీ ఎంత పీక్స్ లో చేస్తే అంత లాభం అన్న విషయాన్ని ‘బాహుబలి 2’ నిరూపించింది. మరి “రోబో 2.0” ఎటు వైపుకు పయనిస్తుందో గానీ, ‘బాహుబలి’ రికార్డులు బద్దలు కొట్టాలనే టార్గెట్ మాత్రం ‘రోబో 2.0’ నిర్దేశించుకున్నట్లుగా కనపడుతోంది. ఏది ఏమైనా రజనీ సినిమాకు జరుగుతున్న హడావుడి, హంగామాలు ఇండియాలో మరే ఇతర హీరోకు జరగవని చెప్పడంలో అతిశయోక్తి ఎంత మాత్రమూ లేదు.

ADVERTISEMENT
Latest Stories