231 km walk for Ram Charan ఈ మధ్య కాలంలో తమ అభిమాన స్టార్లను కలిసే అవకాశం కోసం ఎంతో దూరం నడిచి వార్తలలో నిలుస్తున్నారు. మొన్న ఆ మధ్య ఒకతను తెలంగాణ నుండి ముంబై వెళ్లి సోను సూద్ ని కలిసి వచ్చాడు. తాజాగా ఇటువంటి అనుభవమే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు కలిగింది. అతని కోసం నలుగురు అభిమానులు జోగులాంబ గద్వాల్ నుండి హైదరాబాద్ నడిచివచ్చారు.

సంధ్య జయరాజ్, రవి, వీరేష్ అనే అభిమానులు దాదాపుగా 231 కిలోమీటర్ల దూరాన్ని నాలుగు రోజులలో పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకున్నారు. వారి గురించి తెలుసుకున్న రామ్ చరణ్ వారిని కలిసి ఆప్యాయంగా మాట్లాడారు. ఒక్కొక్కరినీ ఆలింగనం చేసుకుని కుశలప్రశ్నలు అడిగారు. ఫోటో అవకాశం ఇచ్చారు. తన కోసం మరో సారి ఇటువంటి సాహసం చెయ్యవద్దని విజ్ఞప్తి చేశారు.

రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి ఇంకా 30 పని దినాల షూటింగ్ మిగిలి ఉంది. ఇందులో మెజారిటీ రామ్ చరణ్ భాగాలని సమాచారం. ఈ నెలలోనే అలియా భట్ కూడా హైదరాబాద్ రానుంది. ఇక ఆచార్య లో రామ్ చరణ్ కు అటు ఇటుగా ఒక వారం పని మిగిలి ఉంది.

ఈ రెండు సినిమాల షూటింగ్ వీలైనంత తొందరగా పూర్తి చేసి శంకర్ తో తన తదుపరి చిత్రం మీద ఫోకస్ చెయ్యాలని రామ్ చరణ్ ఆలోచన. ఒకవేళ శంకర్ సినిమా కాస్త ఆలస్యమైతే ఒక బ్రేక్ తీసుకుని భార్య ఉపాసనతో హాలిడేకి వెళ్లే ప్లాన్ లో ఉన్నాడు చరణ్. అయితే ఈ హోలీడే ప్లాన్ అనేది రాజమౌళి సినిమా త్వరగా పూర్తి చేస్తేనే అవుతుంది.