24 హైకోర్టుల్లో 40 లక్షల 54 వేలు కేసులు పెండింగ్!

24 high courts with 40.54 lakh pending cases due to lack of judgesదేశవ్యాప్తంగా హైకోర్టుల్లో ఉన్న పెండింగ్ కేసులపై సుప్రీంకోర్టు నివేదిక దిగ్భ్రాంతికర వాస్తవాలను వెల్లడించింది. 24 హైకోర్టుల్లో 40 లక్షలా 54 వేల పెండింగ్ కేసులు ఉన్నాయని సుప్రీం కోర్టు విడుదల చేసిన 2015-16 భారత న్యాయ వ్యవస్థ నివేదిక స్పష్టం చేసింది. వీటిల్లో సుమారు 23 లక్షల సివిల్ కేసులు ఉన్నట్టు వెల్లడించింది. 7.5 లక్షల కేసులు ఏకంగా పదేళ్లకు పైగా పెండింగులో ఉన్నాయని పేర్కొంది. హైకోర్టుల్లో 44 శాతంగా ఉన్న న్యాయమూర్తుల కొరత దేశ న్యాయ వ్యవస్థను పట్టి పీడిస్తున్నదని వ్యాఖ్యానించింది.

ADVERTISEMENT

దేశంలోని హైకోర్టుల్లో 1,079 మంది న్యాయమూర్తుల నియామకాలు జరగాల్సి వుండగా, జూన్ 2016 నాటికి 609 మంది మాత్రమే ఉన్నారని పేర్కొంది. ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ హైకోర్టులో ఉండాల్సిన న్యాయమూర్తుల కన్నా 50 శాతానికి పైగా తక్కువ సంఖ్యలో న్యాయమూర్తులు ఉన్నారని తెలిపింది. సిక్కిం, త్రిపుర హైకోర్టుల్లో మాత్రమే 100 శాతం న్యాయమూర్తులు ఉన్నారని వెల్లడించింది.

ADVERTISEMENT
Latest Stories