“30 ఇయర్స్ ఇండస్ట్రీ” పృధ్వీపై సంచలన ఆరోపణలు!

ballireddy-prudhviraj-police-caseఎంతో కష్టపడి తెలుగు సినీ పరిశ్రమలో నిలదొక్కుకున్న ‘30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ’ ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ కమెడియన్లలో ఒకరు. అలాగే తాజాగా హీరో అవతారం కూడా దాల్చిన పృధ్వీ, ఇప్పటికే మూడు సినిమాలకు ప్రధాన పాత్రకు కమిట్ అయ్యారు. ఓ వైపు కమెడియన్ గా, మరో వైపు హీరోగా బిజీబిజీగా ఉన్న పృధ్వీపై తాజాగా సంచలన ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

ADVERTISEMENT

హైదరాబాద్, బంజారాహిల్స్, రోడ్ నెంబర్ 14లోని నందినగర్ లో పృధ్వీ తన సినీ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ ఆఫీస్ లో రిసెప్షనిస్ట్ గా తూర్పు గోదావరి జిల్లా గోకవరం గ్రామానికి చెందిన 30 ఏళ్ళ యువతి విధులు నిర్వహిస్తోంది. అయితే తనతో పృధ్వీ సహజీవనం చేస్తున్నాడని, తనను వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేయడంతో పాటు వేధింపులకు పాల్పడుతున్నారని… సదరు మహిళ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories