ఏపీలో 4వ రాజధాని?

4th capital in Andhra pradeshమూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుని, అమరావతి పేరుతో అప్పు పుట్టించుకోవాలని జగన్ సర్కార్ చేసిన కార్యాచరణ బహిరంగమైన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఏది ఏమైనా మూడు రాజధానుల అంశానికే వైసీపీ కట్టుబడి ఉందని ఇప్పటికీ పలువురు నేతలు మీడియాలలో వ్యాఖ్యానిస్తూనే ఉన్నారు.

అయితే ఈ సారి మూడు కాదు, నాలుగు రాజధానుల బిల్ పెట్టమంటూ పులివెందుల టీడీపీ ఇంచార్జ్ మరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి మనవి చేసారు. ఇప్పటివరకు ప్రకటించిన మూడు రాజధానుల పేర్లకు తోడుగా కొత్తగా నాలుగవ రాజధానిగా గుడివాడ పేరును చేర్చమని ఛలోక్తులు విసిరారు.

ADVERTISEMENT

గుడివాడను నాలుగవ రాజధానిగా ఎందుకు పెట్టాలో కూడా కారణాన్ని వివరించారు. రాష్ట్రంలో ఎలాగూ ఆదాయం తగ్గింది అంటున్నారు కదా, గుడివాడలో పెట్టిన కేసినో ఆదాయం చూపించి బ్యాంకులను అప్పు కూడా అడగవచ్చని జగన్ పాలనపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

అయిదు రోజుల్లోనే దాదాపుగా 300 కోట్ల విలువైన లావాదేవీలు గుడివాడలో జరిగాయన్న కధనాన్ని ఇటీవల ప్రముఖ మీడియా ఛానల్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన విషయం తెలిసిందే. దీని ప్రకారమే గుడివాడను 4వ రాజధానిగా పెట్టమని జగన్ సర్కార్ తీరును ఏకరువు పెడుతూ బీటెక్ రవి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

ADVERTISEMENT
Latest Stories