కేరళ స్టోరీ వెనుక అసలు ఎజెండా ఏంటి

The Kerala Storyఒక సినిమా విషయంలో ఏకంగా సుప్రీమ్ కోర్టు జోక్యం చేసుకోవాల్సి రావడం చాలా అరుదు. అందుకే మొన్నటి దాకా ఎవరికీ తెలియకుండా ఉన్న ది కేరళ స్టోరీ ఒక్కసారిగా దేశవ్యాప్త చర్చలోకి వచ్చింది. గత ఏడాది అచ్చం ఇదే తరహాలో ది కాశ్మీర్ ఫైల్స్ ని చుట్టుముట్టిన వివాదాల గురించిన వేడి ఇంకా పచ్చిగా ఉండగానే ఇప్పుడీ కేరళ స్టోరీ మరో డిబేట్ కి అవకాశం ఇచ్చింది. ట్రైలర్ చూశాక ముస్లిం సంఘాలు భగ్గుమన్నాయి. కొందరు ఇందులో చూపించింది నిజమని నిరూపిస్తే కోటి రూపాయల బహుమానం ఇస్తామని ప్రకటనలు జారీ చేశారు. ఈ పరిణామాల ఫలితమే నిన్న సాయంత్రం నుంచి పెరిగిన కలెక్షన్లు, సెకండ్ షోకు పడిన హౌస్ ఫుల్ బోర్డులు.

అసలు అంతగా ఇందులో ఏముంది. కేరళ కాసర్గోడ్ ప్రాంతంలో ఉన్న ఓ నర్సింగ్ కాలేజీ విద్యార్థులను అందులో స్లీపర్ సెల్ గా పని చేసే ఒక అమ్మాయి ట్రాప్ చేసి అల్లా గొప్పదనాన్ని ఇంజెక్ట్ చేస్తుంది. బ్రెయిన్ వాష్ చేసి ఇస్లాం భావజాలంతో ఉగ్రవాద సంస్థల్లో చేరేలా ప్రేరేపిస్తుంది . దీని కోసం లవ్ జిహాద్ చేయిస్తారు. ముందే చేసుకున్న ప్లాన్ ప్రకారం టార్గెట్ చేసిన అమ్మాయిలను అబ్బాయిల ప్రేమలో పడేలా చేసి గర్భం దాకా తీసుకొచ్చి అప్పుడు మతం మారాలనే కండీషన్ పెట్టడమన్న మాట. సహజంగానే సమాజం నుంచి వచ్చే చీత్కారాలకు భయపడి ఒప్పుకుని నరకకూపంలోకి వెళ్తారు. ఆలా సిరియాకు వెళ్లిన ముగ్గురమ్మాయిల కథే కేరళ స్టోరీ.

ADVERTISEMENT

కొందరు ఫిర్యాదు చేసినట్టు ఇందులో ప్రాపగండా ఉంది. నిజంగా జరిగిన సంఘటనలకు తెరరూపం ఇవ్వాలన్న తాపత్రయమూ ఉంది. దర్శకుడు సుదిప్తో సేన్ వ్యక్తిగత ఎజెండా ఏమైనా సినిమాలో మాత్రం ఓ మతం ముసుగులో ఉన్న చీకటి కోణాన్ని జనరలైజ్ చేయాలన్న ప్రయత్నం బలంగా జరిగింది. ఈ లవ్ జిహాద్ వల్ల రియల్ లైఫ్ లో బాధితులు ఉన్నప్పటికీ వాళ్ళ వ్యధని తెరమీద తీసుకొచ్చినప్పుడు సామాన్యుల్లో ఇది కేరళలో వేలాది లక్షలాది మహిళలకు జరుగుతున్న అన్యాయంగా అనిపిస్తుంది. వాస్తవం వేరే ఉండొచ్చు. కేరళ స్టోరీని వ్యతిరేకిస్తున్న వాళ్ళు చెబుతున్నది ఇదే. కానీ సుదిప్తో సేన్ ఒకవైపే నిలబడటం ఇందులో ప్రధాన సమస్య.

ది కేరళ స్టోరీ డాక్యుమెంటరీ స్టైల్ నే అనుకరించింది. కాకపోతే కొన్ని సున్నితమైన విషయాలను మరీ లోతుగా బోల్డ్ గా చూపించడం అంత ఆమోదయోగ్యంగా అనిపించదు. పొలిటికల్ అజెండా స్పష్టంగా కనిపిస్తుంది. రాష్ట్రం ఏదైనా ఒక సమస్య పట్ల బాధితులు కోట్లలో ఉంటేనే అది సినిమాగా మారినప్పుడు కోట్లాది ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. లేదూ ఒక వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేసినప్పుడు అసలు ఉద్దేశాలు ఎంత న్యూట్రల్ మైండ్ తో చూసినా బయటపడతాయి. అదా శర్మ పెర్ఫార్మన్స్, ఆర్టిస్టుల సెలక్షన్ బలంగా నిలబడిన కేరళ స్టోరీ కొందరిని ఉద్దేశించి అందరి కోసమని చెబుతూ తీసిన సినిమా కాబట్టి ఆ రాజకీయ కోణంలో చూస్తే తప్ప కనెక్ట్ అవ్వదు.

ADVERTISEMENT
Latest Stories