తమిళ హీరోల మాదిరి పవన్ ఎందుకు ఆదుకోవడం లేదు!

Addari kishore babu comments on pawan kalyan jana sena‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ పై ఆంధ్రప్రదేశ్ విద్యార్థి, యువజన జేఏసీ నాయకుడు అడారి కిషోర్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై నకిలీ ట్వీట్లతో విద్యార్థులు, యువతను పవన్ తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌ వద్ద సోమవారం మీడియాతో మాట్లాడిన కిషోర్… సమైక్యాంధ్ర ఉద్యమంలో లక్షలాది మంది విద్యార్థులు, యువకులపై పోలీసులు కేసులు నమోదు చేసినప్పుడు పవన్ ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు.

తెలంగాణ ఉద్యమకారులకు భయపడిన పవన్ అప్పట్లో సమైక్య ఉద్యమాన్ని, అందులో పాల్గొన్న ప్రజలను పట్టించుకోలేదని విమర్శించారు. తమిళనాడులో ‘జల్లికట్టు’ కోసం జరిగిన ఉద్యమం మాదిరిగా ‘ప్రత్యేక హోదా’ సాధన కోసం ఉద్యమిద్దామని చెబుతున్న పవన్… మరి తమిళ హీరోల్లా ప్రజల్ని ఎందుకు ఆదుకోవడం లేదని కిషోర్ కుమార్ ప్రశ్నించారు. క్రియాశీలక రాజకీయాల్లో యాక్టివ్ అవుతోన్న పవన్ కు రాజకీయ నాయకుల నుండే కాకుండా, విద్యార్థి సంఘాల నుండి విమర్శలు వ్యక్తమవ్వడం ఊహించిన పరిణామం కాదు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories