ఇక భారమంతా పవన్ కళ్యాణ్ పైనే!

agnyaathavaasi-audio-reviewఅనిరుధ్ స్వరపరిచిన “అజ్ఞాతవాసి” విడుదలై, వీకెస్ట్ ఆల్బమ్ గా టాక్ తెచ్చుకుంది. సాహిత్యం పరంగా పర్వలేదనిపించినా… రిపీటెడ్ మోడ్ లో వినడానికి ఒక్క పాట కూడా లేకపోవడం అభిమానులను పూర్తిగా నిరుత్సాహపరుస్తోంది. దీంతో త్రివిక్రమ్ – పవన్ కాంబోకు సంగీతం అందించే దేవిశ్రీప్రసాద్ ను చాలా మిస్ అయ్యాము అనే ఫీలింగ్ లో సంగీత ప్రియులు, పవర్ స్టార్ ఫ్యాన్స్ ఉన్నారు.

ADVERTISEMENT

అయితే ఈ ఆల్బమ్ ను నిలబెట్టే భారాన్నంతా పవన్ తన నెత్తిపై వేసుకోనున్నాడు. ఇప్పటికే విడుదలైన పాటలు కాకుండా ‘అజ్ఞాతవాసి’లో మరో పాట కూడా ఉంది. అది స్వయంగా పవన్ కళ్యాణ్ పాడింది కావడం మరింత చెప్పుకోదగిన అంశం. దీంతో ఆ పాట అయినా ఆకట్టుకునే రీతిలో ఉంటుందేమో అన్న గంపెడాశలో ఫ్యాన్స్ ఉన్నారు. సహజంగా పవన్ ఆలపించే గీతాలు మాంచి ఊపులో ఉంటాయి.

జానపద పద్యాలు, పల్లెటూరి సాహిత్యం పవన్ పాడే పాటలలో ఎక్కువగా వినపడుతుంది. మరి 31వ తేదీన విడుదల కానున్న లేటెస్ట్ సాంగ్ కూడా అదే రూట్ ను ఎంచుకుంటే మాత్రం… అనిరుధ్ నుండి మరో ‘కొలవెరి’ వచ్చినట్లే. లేదంటే “అజ్ఞాతవాసి” ఆడియో పరంగా పూర్తి నిరుత్సాహకరంగా మిగిలిపోయే సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి. ‘స్పైడర్’తో సహా ఇటీవల కాలంలో పెద్ద హీరోల సినిమాలు ఆడియో పరంగా వరుసగా విఫలమవుతూ ఉండడం కాస్త ఆలోచించదగ్గ అంశమే.

ADVERTISEMENT
Latest Stories