టెక్నాలజీ లో వస్తున్న మార్పులు ప్రపంచ ఐటీ రంగాన్ని గడగడాలాడిస్తున్నాయి. ప్రస్తుతం ఆర్టిఫిషల్ ఇంటిలిజెంట్ పేరుతో టెక్నాలజీలో వస్తున్న, రాబోతున్న మార్పులతో ఐటీ ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
AI టెక్నాలిజీ తో పనులు వేగవంతం కావడంతో పాటుగా శ్రామిక శక్తి అవసరం కూడా ఘననీయంగా తగ్గనుంది. ఈ క్రమంలో AI ప్రభావం ఐటీ ఉద్యోగుల భవిష్యత్ పై ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతుంది.
AI రాకతో ఐటీ రంగంలోని అనేక పనులను ఉదాహరణకు కోడింగ్, టెస్టింగ్, డేటా ఎనాలసిస్ వంటి కార్యక్రమాలను మానవ శక్తితో అవసరం లేకుండానే ఈ కృత్రిక మేధస్సు పూర్తి చెయ్యగలదు. దీనితో జూనియర్ సాఫ్ట్ వేర్ డవలపర్స్, టెస్టర్ వంటి ఐటీ ఉద్యోగుల డిమాండ్ తగ్గే పరిస్థితి ఏర్పడుతుంది.
తద్వారా ఈ రంగం నుంచి నిరుద్యోగ సమస్య తీవ్ర రూపం దాల్చే ప్రమాదం లేకపోలేదు. అలాగే ఈ ఐటీ రంగం మీద ఆధారపడి జీవనం సాగించే చిరు వ్యాపారస్తుల ఆదాయానికి గండి పడే అవకాశం ఉంది. AI డవలప్మెంట్ తో చాల రంగాలలో మానవ వనరుల అవసరం తగ్గిపోవడం పెద్ద ముప్పుగా మారబోతుంది.
గతంలో వంద మంది చేసే పనిని ఇప్పుడు కొన్ని AI టూల్స్ సహాయంతోనే పూర్తి చేయగలుగుతున్నారు. దీనితో ఉద్యోగులలో తమ ఉద్యోగం పట్ల అనిచ్చితి, అభద్రత ఏర్పడుతుంది, అలాగే ప్రస్తుత AI ట్రెండ్ కి తగ్గట్టుగా అప్ గ్రేడ్ కావలసిన ఆవశ్యకత మొదలవుతుంది. అందుకు అనుగుణంగా అడుగులు ముందుకేసిన వాడే ఈ రంగంలో నిలదొక్కుకోబోతున్నారు.
ఈ AI సృష్టిస్తున్న ప్రకంపనలు దేశీయ మార్కెట్లను సైతం ఎరుపెక్కిస్తున్నాయి. టెక్ స్టాక్స్ భారీ ఫాల్స్ ని ఎదుర్కొంటు భారతీయ స్టాక్ మార్కెట్లను బేర్ దిశగా పతనం చేస్తున్నాయి. AI ప్రభావంతో ఒక్క భారతీయ స్టాక్ మార్కెట్లే కాదు ప్రపంచ స్టాక్ మార్కెట్లు సైతం ఈ కృత్రిమ మేధస్సు దెబ్బకు కుదేలవుతున్నాయి.
AI స్టాక్స్ పతనంతో లక్షల కోట్ల సంపద ఆవిరయిపోతుంది. ఇది ప్రత్యక్షంగానూ పరోక్షంగా ఆ దేశ జీడీపీ పై ప్రభావం చూపనుంది. అయితే AI ఒక్క ఐటీ రంగాన్ని మాత్రమే ప్రభావితం చేస్తుందనుకోవడం వెర్రి తనమే అవుతుంది. దీని ప్రభావం ప్రతి రంగం మీద అంతోఇంతో ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఐటీ రంగం అనేది మొదటి బాధిత స్థానంలో ఉండడం ఇక్కడ భవిష్యత్ ఐటీ తరాన్ని, ప్రస్తుత టెక్ ఉద్యోగులను ఆందోళనలోకి నెడుతుంది.
AI మొత్తానికి భవిష్యత్ అభివృద్ధి కి దోహదపడుతూనే వర్తమానాన్ని భయపెడుతుంది. AI తో రానున్న ఈ మార్పులకు అన్ని రంగాలు సిద్ధంగా ఉండాల్సిందే, అలాగే ఈ నైపుణ్యం మీద ప్రతి ఒక్కరు పట్టు పెంచుకోవాల్సిందే, అందుకు తగ్గట్టుగానే ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ అవ్వాల్సిందే. లేకుంటే ఫలితాలు సంక్షోభం దిశగా తీసుకెళ్లే ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది.






