ఇటీవల విడుదలైన ‘యే దిల్ హై ముష్కిల్’ సినిమా టీజర్లు వీక్షకులలో వేడి పుట్టించిన విషయం తెలిసిందే. యూ ట్యూబ్ లో సంచలనంగా మారిన ఈ టీజర్లో… అందాల బొమ్మ ఐశ్వర్యరాయ్, యువహీరో రణ్ బీర్ కపూర్ ల మధ్య ఉన్న రొమాంటిక్ సన్నివేశాలు ‘టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ’గా మారాయి. ఐశ్వర్య అందాలకు తోడు, ఘాటు ముద్దు సన్నివేశాలు కూడా ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.
టీజరే ఈ రేంజ్ లో ఉంటే… సినిమా ఇంకెంత రేంజ్ లో ఉంటుందో అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘బులెయా’ పాటలో హాట్ హాట్ గా కనిపించిన ఐష్ ను చూసి సినీ అభిమానులు ఫిదా అయిపోయారు. అయితే, ఈ సినిమాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఐశ్వర్య, రణ్ బీర్ ల మధ్య ఉన్న రొమాంటిక్ సీన్లు శృతిమించాయని సెన్సార్ బోర్డు కన్నెర్ర చేసింది. సినిమాలో అసభ్యంగా అనిపించిన మూడు సన్నివేశాలను తొలగించి, ‘యూ/ఏ’ సర్టిఫికేట్ ను ఇచ్చింది.
సెన్సార్ బోర్డు నిర్ణయంతో షాక్ కు గురి కావడం దర్శకుడు కరణ్ జోహార్ వంతవుతోంది. ఈ సినిమాకు ఆ మూడు సన్నివేశాలే అత్యంత కీలకమని బోర్డుతో వాదించినా ఫలితం లేకపోయింది. సెన్సార్ బోర్డు సభ్యులు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా, తమ నిర్ణయం సరైనదే అని తేల్చి చెప్పడంతో ఐష్ – రణబీర్ ల హాట్ సీన్లకు కత్తెర పడక తప్పలేదు. ఈ దీపావళికి సందర్భంగా “యే దిల్ హై ముష్కిల్” సినిమా ప్రేక్షకుల ముందు కన్నుల విందు చేయడానికి సిద్ధమైంది.



