“మేరీ ప్యారీ బిందు” సినిమాలో ఓ పాట పాడిన పరిణితి చోప్రా, ఇప్పుడు ఆ పాటను చూడమని తన తోటి సెలబ్రిటీలను ఒత్తిడి చేస్తోందట. ఎంతగా అంటే… మరో సినిమా షూటింగ్ సెట్స్ లో ఉన్న హీరోలను తన పక్కన కూర్చోపెట్టుకుని, ఈ పాట చూడాల్సిందిగా కోరుతోంది. ఇదేదో ఒక్కసారి కాదు, కనీసం ఓ పది సార్లైనా ఇలా చేస్తోందట. ఇన్ని సార్లు ఒకే పాట చూస్తే ఏమవుతుంది… మాకైతే నిద్ర వచ్చి పడుకుంటున్నాము… అని అజయ్ దేవగన్ సోషల్ మీడియాలో ఓ ఫోటోను పోస్ట్ చేసారు.
“గోల్ మాల్ 4” సెట్స్ లో ఉన్న తమకు పరిణితి ఆలపించిన గీతం చూడాల్సిందిగా టార్చర్ పెడుతోందని సరదాగా వ్యాఖ్యానించిన అజయ్ దేవగన్, ఈ పాటను, పరిణితిని ప్రశంసలతో ముంచెత్తాడు. పరిణితిలో ఇంత టాలెంట్ ఉందని అనుకోలేదని పోస్ట్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. హీరోయిన్ పై చమక్కులు కదా… అభిమానులకు కూడా కావల్సినంత కిక్ ఇచ్చి ఉంటుంది. మంగళవారం నాడు విడుదలైన ఈ పాట ఇప్పటికే 2 మిలియన్ క్లిక్స్ ను అందుకుంది.



