క్షణికావేశమే కాదు రెప్పపాటు అజాగ్రత్త కూడా…

Child Falls From Mall First Floor

ఒక మనిషి ప్రాణాలు పోవడానికి క్షణికావేశ నిర్ణయాలే కాదు రెప్పపాటు అజాగ్రత్త, అశ్రద్ధ కూడా కారణమవుతాయి అనేదాని సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్న వీడియోలే సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.

క్షణికావేశంలో ఎవరి మీదో కోపంతో తమ ప్రాణాలు తీసుకునే వారు ఒకరైతే, అదే క్షణికావేశంలో విచక్షణ మరిచి ఇతరుల ప్రాణాలు హరించేవారు మరొకరు. ఇక అక్రమ సంబంధాల పేరుతో, ఇష్టం లేని వ్యక్తితో జీవించలేమంటూ మరొకరు ఇలా నిత్యం తమ తమ చర్యలతో సోషల్ మీడియాలో వార్తలుగా నిలుస్తున్నారు.

ADVERTISEMENT

ఇక తాజాగా రెప్పపాటు అజాగ్రత్త కారణంగా జరిగిన ఒక దురదృష్ట ఘటన కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒక పసిపాప ఫస్ట్ ఫ్లోర్ లో సరదాగా ఆడుకుంటూ అనుకోకుండా అదే ఫ్లోర్ నుంచి జారీ కింద పడిన ఘటన ఇప్పుడు పసిపిల్లల తల్లితండ్రులకు ఒక హెచ్చరిక గా మారింది.

పసిపిల్లలు ఉన్న ఇంట్లో రెప్పపాటు అజాగ్రత్త, అశ్రద్ధ తమ పిల్లలకు ఎంతటి ప్రాణాపాయాన్ని తెచ్చిపెడుతుంది అనేదానికి ఈ దుర్ఘటన ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది. అసలు విషయానికొస్తే, కర్ణాటక చిక్బల్లాపూర్ లోని ఓ షాపింగ్ మాల్ కాంప్లెక్ కారిడార్ లో ఆడుకుంటున్న ఒక చిన్నారి కారిడార్ గ్రిల్ ఎక్కబోతూ ప్రమాదశాత్తు జారీ కింద పడిపోయింది.

మొదటి అంతస్తు నుంచి కిందపడిపోవడంతో ఆ చిన్నారికి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియో చూసిన వారంతా దేవుని దయతో ఆ చిన్నారి ప్రాణాలతో తిరిగి ఇంటికి చేరాలని ప్రార్థిస్తున్నారు. అయితే చిన్నారులను బయటకు తీసుకువెళ్ళేటప్పుడు తల్లితండ్రులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని ఇటువంటి ఘటనలు హెచ్చరిస్తూనే ఉంటాయి.

ADVERTISEMENT
Latest Stories