లైలా లేకుండా వచ్చిన మజ్ను!

Akhil Akkineni Mr Majnu Diwali poster talkతొలి రెండు సినిమాలతో అనూహ్యమైన పరాజయాలు దక్కించుకున్న అక్కినేని అఖిల్, మూడవ ప్రయత్నంగా “మిస్టర్ మజ్ను”తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘తొలిప్రేమ’ ఫేం అట్లూరి వెంకీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఫస్ట్ టీజర్ ఇప్పటికే విడుదలై ప్రేక్షకులకు మెప్పించగా, తాజాగా దీపావళి శుభాకాంక్షలు చెప్తూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేసారు.

ADVERTISEMENT

[m9ad]

లైలా లేకుండా ఓ స్టెప్ వేసుకుంటూ సింగిల్ గా ఉన్న “మజ్ను” పోస్టర్ అక్కినేని అభిమానులను మెప్పిస్తోంది. ‘బాయ్స్ విల్ బీ బాయ్స్’ అనే ట్యాగ్ లైన్ తో 2019, జనవరిలో ఈ సినిమా విడుదల అవుతోంది. ‘అత్తారింటికి దారేది’ ప్రొడ్యూసర్ బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు. మరి ఈ మూడవ సినిమా అయినా అఖిల్ కు కావాల్సిన రిజల్ట్ ఇస్తుందో లేదో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories