షో బిజ్ లాంటి ఎంటర్టైన్మెంట్ మ్యాగ్ జైన్లు చదవొద్దని బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పిలుపునిచ్చారు. సదరు మ్యాగ్ జైన్ ప్రచురించిన మూడు వివాదాలను ప్రస్తావిస్తూ… ప్రియాంకా చోప్రాతో తనకు ఎలాంటి విభేదాలు లేవని, అవకాశం వస్తే మరోసారి ఆమెతో నటించేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పాడు. అలాగే ఫరాఖాన్ తో తనకు గొడవ జరగలేదని, ఫరాతో పాటు ఆమె సోదరుడు సాజిద్ ఖాన్ కూడా తనకు స్నేహితుడేనని అన్నాడు.
ఇక స్నేహితుల మధ్య గొడవలేముంటాయని ఎదురు ప్రశ్నించిన అక్షయ్, ఏక్తా కపూర్ తో వివాదం గురించి అనగానే… అసలు వీళ్లందరితో తనకు వివాదాలున్నాయని ఎవరన్నారు? వాళ్లకి ఫోన్ చేయండి మాట్లాడుతాను అన్నాడు. అసలీ పుకార్లు ఎవరు రేపారు? అంటూ ప్రశ్నించాడు. దీంతో షోబిజ్ మ్యాగ్ జైన్ లో చదివాననగానే… ముందు అలాంటి మ్యాగ్ జైన్లు చదవడం మానేయ్యండి. అలాంటి మ్యాగ్ జైన్లు గతంలో ఎన్నో కాపురాలు కూల్చాయి అంటూ సమాధానమిచ్చాడు.



