టాలీవుడ్ బరువు మోయాల్సింది ఆదిపురుషే

Adipurush Movieగత కొన్నేళ్లలో తెలుగు సినిమాకు ఇంత బ్యాడ్ సమ్మర్ రాలేదు. వచ్చే నెల నుంచి స్కూళ్ళు కాలేజీలు తెరవబోతున్నారు. వేసవిలో గట్టిగా చెప్పుకునే బ్లాక్ బస్టర్ గా విరూపాక్ష ఒకటే నిలిచింది. దసరా, బలగం వచ్చే నాటికి ఇంకా పూర్తి స్థాయి ఎండలు మొదలుకాలేదు. ఇక గత రెండు నెలల్లో ఎన్ని డిజాస్టర్లు వచ్చాయో లెక్కబెట్టడం కష్టం. అందుకే ఇప్పుడు టాలీవుడ్ ఆశలన్నీ ఆదిపురుష్ మీదే ఉన్నాయి. పిల్లా జెల్లాతో సహా అందరిని థియేటర్లకు రప్పించే సత్తా ఉన్న బొమ్మగా డిస్ట్రిబ్యూటర్లు దీనికి మీద భారీ పందేనికి సిద్ధపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల హక్కులే 180 కోట్ల పైమాటేనట.

ప్రభాస్ ఇమేజ్ ఓపెనింగ్స్ ని తెచ్చినా మూడు గంటల రామాయణ గాథ ఏ స్థాయిలో మెప్పించబోతుందన్నది కీలకం. టీజర్ కు వచ్చిన నెగటివ్ ఫీడ్ బ్యాక్ ట్రైలర్, పాటల వల్ల దాదాపుగా తగ్గిపోయింది. ముఖ్యంగా జై శ్రీరామ్ సౌండ్ బలంగా వెళ్ళింది. ఈ నేపథ్యంలో నార్త్ లోనూ బాక్సాఫీస్ డ్రైగా ఉన్న పరిస్థితిని ఆదిపురుష్ పూర్తిగా వాడుకునే ఛాన్స్ దక్కింది. ఎలాగూ రాముడి గాథ కాబట్టి బిజెపి పాలిత రాష్ట్రాల్లో ప్రత్యేక మినహాయింపులు అనుమతులు ఉంటాయనే ప్రచారం ఇప్పటికే మొదలైంది. ఏపీ తెలంగాణలో పన్ను రాయితీలు ఇచ్చినా ఇవ్వకపోయినా పబ్లిక్ పోటెత్తడం ఖాయం.

ADVERTISEMENT

ఆదిపురుష్ ని నిజమైన నటీనటులతో పాటు మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లాంటి అత్యాధునిక సాంకేతికతలు వాడారు. స్క్రీన్ మీద యాక్టర్స్ నటించేటప్పుడు ఏది నిజమో ఏది విజువల్ ఎఫెక్ట్ ద్వారా సృష్టించిందో గుర్తు పట్టడం కష్టం. ఏ మాత్రం తేడా వచ్చినా దొరికిపోవడం ఖాయం. కానీ దర్శకుడు ఓం రౌత్ ఆ ఛాన్స్ ఇవ్వడనే ధీమా ఇప్పటిదాకా వచ్చిన విజువల్స్ చూసి ఫ్యాన్స్ లో బలంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా రెండు వేల కోట్ల దాకా బిజినెస్ టార్గెట్ పెట్టుకోవచ్చనే లెక్క ఫైనల్ గా నిజమో కాదో ఇంకో వారం పది రోజుల్లో తేలిపోతుంది.

ఇప్పటిదాకా టాలీవుడ్ లో ఎన్నో రాముడు సినిమాలు వచ్చాయి. ఎన్టీఆర్, శోభన్ బాబు, సుమన్ దాదాపు అందరూ విజయాలు అందుకున్నారు. కానీ ప్రభాస్ చాలా కొత్తగా దర్శనమిస్తున్నాడు. పైగా కృతి సనన్ లాంటి గ్లామర్ హీరోయిన్ ని సీతగా జనాలు ఎంత మేరకు స్వీకరిస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది. మూడు గంటల ఆదిపురుష్ అంతసేపు జనాన్ని థియేటర్లలో కూర్చోబెట్టేందుకు ప్రభాస్ ఇమేజ్ ఒకటే సరిపోదు. టైటిల్ నుంచి క్లైమాక్స్ దాకా ఎక్స్ ట్రాడినరి అనిపించేలా ప్రతి ఫ్రేమ్ అబ్బురపరచాలి. అప్పుడే కొండంత లక్ష్యాన్ని గురి చూసి కొట్టొచ్చు.

ADVERTISEMENT
Latest Stories