అల్లు వారి మాటల్లో ఎన్నెన్నో అర్థాలు పాఠాలు

Allu Aravindఒక అగ్ర నిర్మాణ సంస్థ లేదా నిర్మాత దశాబ్దాల తరబడి ఒకే పొజిషన్ లో కొనసాగడం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టం. ఒకప్పుడు విజయా, వాహిని లాంటి బ్యానర్లు బ్లాక్ అండ్ వైట్ కాలంలో ఎన్నో పరిమితుల మధ్య గొప్ప సినిమాలు తీశారు. సురేష్ ప్రొడక్షన్స్ పదిహేనేళ్ల కింద వరకు చాలా యాక్టివ్ గా ఉంది.

రామానాయుడు గారు కాలం చేశాక సురేష్ బాబు స్పీడ్ తగ్గించేశారు. చాలా క్యాలికులేటెడ్ గా ప్రాజెక్టులు టేకప్ చేస్తున్నారు. ఒక్కోసారి వర్కౌట్ కాదనుకుంటే తమ్ముడు సినిమా అయినా సరే మొహమాటపడకుండా డైరెక్ట్ ఓటిటికి ఇచ్చేస్తున్నారు. కానీ అల్లు అరవింద్ లెక్క వేరుగా ఉంది. ఇప్పటికి ఆయన ఫామ్ లోనే ఉన్నారు.

ADVERTISEMENT

గీతా ఆర్ట్స్ 2 వెనుక బన్నీ వాస్ దే బాధ్యత అయినప్పటికీ వెనుక ఉండి నడిపించేది పెద్దాయనే. ఆహా ఓటిటిలో ఏదైనా ఓకే అవ్వాలంటే అరవింద్ దగ్గరకు వెళ్లాల్సిందే. ఈ వయసులోనూ హుషారుగా ప్రొడక్షన్ లో ఉంటూ వస్తున్నారు. చందూ మొండేటితో గతంలోనే రెండు కమిట్ మెంట్లు తీసుకున్నారు. వాటిలో ఒకదానికి రెండు వందల కోట్ల బడ్జెట్ ఉంటుందని దర్శకుడే చెబుతున్నారు. బోయపాటి శీనుతో మరో మూవీకి రంగం సిద్ధమవుతోంది.

ధృవ టైంలో ఇచ్చిన మాటని సురేందర్ రెడ్డి ఇప్పుడు తీర్చుకోవాల్సి ఉంటుంది. ఏజెంట్ ఇంత దారుణంగా పోయినా మళ్ళీ ఇంకో ఛాన్స్ రిజర్వ్ లో ఉండటం అదృష్టమే. బాలకృష్ణతో ఓ మూవీ ప్లానింగ్ అన్ స్టాపబుల్ షూటింగ్ నుంచే ఉంది. దర్శకుడు కథ ఫైనలవ్వాలే కానీ ఇద్దరూ రెడీగా ఉన్నారు.

బాలీవుడ్ లో కార్తీక్ ఆర్యన్ తో మరో ప్రతిపాదన ఉంది. మురుగదాస్ తో వేరుగా ఇంకో హీరో కాంబినేషన్ కోసం కథ రాయిస్తున్నారు. రామ్ చరణ్ తో మగధీర, ధృవల తర్వాత హ్యాట్రిక్ పూర్తి చేయాలనే టార్గెట్ ఉంది. ఇవన్నీ అరవింద్ కంట్రోల్ లోనే ఉన్నాయి. ఇదంతా ప్రత్యేకంగా చెప్పడానికి కారణం ఉంది. మైత్రి, పీపుల్స్ మీడియా, ఎస్విసి, హోంబాలే లాంటి సంస్థలే సౌత్ లో లీడింగ్ లో ఉన్నాయి.

అశ్వినీదత్ సైతం ప్రాజెక్ట్ కె మినహాయించి మునుపటిలా స్పీడ్ గా లేరు. సో ఒకప్పుడు గీతా ఆర్ట్స్ సమాంతరంగా ఉన్న కంపెనీలు దూకుడు పూర్తిగా తగ్గించుకున్న టైంలో అరవింద్ ఇలా వేగం పెంచడం విశేషమే. గీత గోవిందం టైంలో మాట ఇచ్చిన పరశురామ్ దాన్ని తప్పేసి దిల్ రాజు కాంపౌండ్ కు వెళ్లిపోవడాన్ని పరోక్షంగా ప్రస్తావించిన అరవింద్ ఎలాంటి పరిస్థితులైనా తనను ప్రభావితం చేయలేవని చెప్పకనే చెప్పారు. వెతుక్కోవాలే కానీ ఆయన మాటల్లో అర్థాలు పాఠాలు ఎన్నో ఉన్నాయి.

ADVERTISEMENT
Latest Stories