డిసెంబర్ 6వ తేదీన విడుదల కాబోతున్న “పుష్ప” సినిమా ధియేటిరికల్ ట్రైలర్ కు సంబంధించి, ఓ టీజింగ్ టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. 26 సెకన్ల పాటు ఉన్న ఈ టీజ్ లో ‘జబర్దస్త్’ హాట్ యాంకర్ అనసూయ ఉన్న షాట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బ్లేడ్ నోట్లో పెట్టుకుని ఎవరినో చంపేసే లుక్ లో ఉన్న అనసూయ కొత్తగా కనపడుతోంది. నిజానికి ఈ సినిమాలో అనసూయ పోస్టర్ లుక్ వీక్షకుల విమర్శలకు గురయ్యింది. కానీ ఈ టీజింగ్ షాట్ మాత్రం ‘హాట్ అండ్ బోల్డ్’తో పాటు అనసూయను వెండితెరపై సరికొత్తగా ప్రజెంట్ చేస్తోంది.
Also Read – సోము ‘శీల’ పరీక్ష కు సిద్దపడుతున్నారా.?
‘రంగస్థలం’తో సిల్వర్ స్క్రీన్ పై బిగ్ బ్రేక్ ఇచ్చిన సుకుమార్, మరోసారి అనసూయకు ‘పుష్ప’తో తీపి జ్ఞాపకాలను అందిస్తారేమో చూడాలి. మొత్తానికి ట్రైలర్ లో ఉన్న హైలైట్ షాట్స్ మొత్తాన్ని ఒక దగ్గర క్రోడీకరిస్తూ అల్లు అర్జున్ అభిమానులను చిత్ర యూనిట్ టీజ్ చేస్తోంది.