‘సెల్ఫీ’తో సీరియస్ అయిన ‘స్టైలిష్ స్టార్’

Allu Arjun Selfie Latestఒకప్పుడు చాలా కూల్ గా కనిపించే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఇటీవల కాలంలో తనలోని మరో యాంగిల్ ను కూడా ప్రేక్షకులకు రుచి చూపిస్తున్న విషయం తెలిసిందే. పవన్ అభిమానుల ఉదంతంతో మొదలైన బన్నీలోని యాంగ్రీ యాంగిల్ తాజాగా మరోసారి వెలుగు చూసిందని సమాచారం. అయితే ఈ సారి బన్నీ ఆగ్రహానికి కారణమైంది మాత్రం… తన తాజా సినిమా కోసం ఎంపిక చేసిన పలువురు మోడల్స్ అని తెలుస్తోంది.

హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న “దువ్వాడ జగన్నాథమ్” అనే సినిమా షూటింగ్ లో బన్నీ పాల్గొంటున్న విషయం సినీ విజ్ఞులకు తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం ఓ సంగీత్ సీన్ ను షూట్ చేస్తుండగా, దీని కోసం కొందరు మోడల్స్ ను పిలిపించారట. షూటింగ్ గ్యాప్ లో సదరు మోడల్స్ అంతా అల్లు అర్జున్ తో సెల్ఫీలకు ఎగబడడంతో బన్నీకి చిర్రెత్తుకొచ్చి వారిని పిలిచి క్లాస్ పీకినట్లుగా ట్రేడ్ వర్గాల టాక్.

ADVERTISEMENT

ప్రస్తుతం షూటింగ్ జరుగుతోన్న సంగీత్ సెట్ గురించి కానీ, తన గెటప్ గురించి కానీ బయటకు ఎట్టి పరిస్థితుల్లో లీక్ కాకూడదని వీలులేదని వారికి గట్టిగానే చెప్పడంతో, బన్నీ వార్నింగ్ తో సుందరాంగులంతా సైలెంట్ అయిపోయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఈ సినిమాకు సంబంధించి, అభిమానితో ఉన్న ఓ స్టిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

ADVERTISEMENT
Latest Stories