బన్నీ రెండు నెలల కఠోర శ్రమ?

allu arjun to change look for sukumar movie స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ ల అల వైకుంఠపురములో సినిమా సంక్రాంతికి విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ లోగానే బన్నీ తన తరువాతి చిత్రం సుకుమార్ దర్శకత్వంలో పట్టాలు ఎక్కించాడు. మొన్న ఆ మధ్యనే ఈ సినిమా ముహూర్తం జరుపుకుంది. అయితే బన్నీ అల వైకుంఠపురములో పూర్తయిన తరువాత కనీసం రెండు నెలల గ్యాప్ తీసుకోబోతున్నాడట.

సుకుమార్ సినిమా కోసం లుక్ కంప్లీట్ గా మార్చలట. దాని కోసం రెండు నెలల సాధన ఉంటుందట. ఈలోగా సుకుమార్ బన్నీ లేని సన్నివేశాల షూటింగ్ పూర్తి చేస్తాడట. గతంలో సుకుమార్ మహేష్ బాబు ఒక స్మగ్లింగ్ నేపధ్యంలోని ఒక స్క్రిప్ట్ చెప్పాడు. ఆ సినిమా అధికారికంగా ప్రకటించిన కొన్ని నెలల తరువాత ఆ సినిమాను అటకెక్కించారు.

ADVERTISEMENT

ఇప్పుడు అదే స్క్రిప్ట్ బన్నీ చేస్తున్నాడు. రంగస్థలం ఎలా అయితే రామ్ చరణ్ కేరీర్ లోనే మైలురాయిగా మారిపోయిందో బన్నీ కూడా అటువంటి కోరికతోనే ఉన్నాడట. గతంలో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్య బన్నీని హీరోగా నిలబెట్టింది. ఈ సినిమాతో బన్నీ పెద్ద స్టార్ గా ట్రాన్సఫార్మ్ అవుతాడేమో చూడాల్సి ఉంది.

మరోవైపు అల వైకుంఠపురములో షూటింగ్ వేగంగా సాగుతుంది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు సూపర్ హిట్ అయ్యి సినిమా మీద క్రేజ్ ను పెంచాయి. జనవరి 12, 2020న తమ సినిమాని విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. అయితే అదే రోజున మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ కూడా విడుదల అవుతున్నట్టు ప్రకటించడం విశేషం.

ADVERTISEMENT
Latest Stories