తిరుమలలో అల్లు అర్జున్… మొక్కులు చెల్లించుకున్నారు..!

Allu Arjun Vists Tirumalaటాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నాడు. తన కుమార్తె తలనీలాలను స్వామి వారికి సమర్పించాడు. అనంతరం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నాడు. ఆ తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నాడు. తన భార్య స్నేహ, కుమారుడు, తన తల్లిదండ్రులతో కలసి తిరుమలకు విచ్చేసిన బన్నీ కుటుంబ సభ్యులకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. దర్శనానంతరం వారికి తీర్థ ప్రసాదాలను అందించారు.

ADVERTISEMENT
Latest Stories