మీరు హెడ్డింగులు మార్చేస్తారు… నేను చెప్పనన్న అల్లు అరవింద్..!

allu-arvind-on-khaidi-no-150ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మెగా సినిమాలకు సంబంధించి తొలి వేడుక విజయవాడ పరిసర ప్రాంతాల్లో జరగనుంది. అది కూడా మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా కావడంతో కావలసినంత ప్రచారం లభిస్తోంది. ఎన్ని వాయిదాలు పడినా… మెగా కాంపౌండ్ మాత్రం వేదికను విజయవాడ నుండి మార్చకపోవడం విశేషం. దీంతో భవిష్యత్తులో ఇండస్ట్రీ నుండి ఏపీ ప్రోత్సాహకాలు వస్తాయా? ఒక అనుభవం గల నిర్మాతగా తమ అభిప్రాయాలు చెప్పాలంటూ అల్లు అరవింద్ ను మీడియా వర్గాలు సంధించాయి.

“నేను ఏదైనా చెప్తే… మీరు హెడ్డింగులు మార్చేస్తారు… ప్రస్తుతం ‘ఖైదీ నంబర్ 150’ సినిమాకు సంబంధించిన ప్రశ్నలనే అడగండి… మళ్ళీ మళ్ళీ నేను ఇక్కడికి వస్తుంటాను… మరొక సందర్భంలో ఇండస్ట్రీకి సంబంధించిన సంగతులు, పరిశ్రమ బాగోగులు, ఇతర విషయాలు చెప్తానని” చమత్కరించారు. అల్లు వారి తెలివితేటలు మీడియా వర్గాలకు తెలియనవి కాదు గనుక, ఈ మాటలకు మీడియా వర్గీయులంతా ఓ చిరునవ్వు నవ్వేసారు. రాజకీయ ప్రముఖులు ఎవ్వరూ ఈ వేడుకకు రావడం లేదని కూడా అల్లు స్పష్టత ఇచ్చారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories