అన్నయ్యే కాదు… తమ్ముడు కూడా అదే గెటప్..!

Allu Sirish brahmin getup for SIIMA 2017బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం “దువ్వాడ జగన్నాధమ్” రూపంలో అల్లు అర్జున్ సందడి చేస్తున్న విషయం తెలిసిందే. బ్రాహ్మణుడి పాత్రలో బన్నీ పంచిన హాస్యం అభిమానులను అలరిస్తూ ఉండగా, తాజాగా ఇదే గెటప్ లో అల్లు శిరీష్ కూడా దర్శనమివ్వడం విశేషం. అబుదాబీ వేదికగా జరుగుతున్న సైమా అవార్డుల వేడుకలో బ్రాహ్మణ గెటప్ వేసుకుని స్టేజ్ పైన శిరీష్ సందడి చేయడంతో, సామాన్య ప్రేక్షకులతో పాటు సినీ సెలబ్రేటీలలో నవ్వులు విరిసాయి.

ఒక విధంగా చెప్పాలంటే ఆహార్యంలో బన్నీ కంటే శిరీష్ కే ఈ గెటప్ సూట్ అయ్యిందని వీక్షకులు అనుకోవడం విశేషం. బహుశా భవిష్యత్తులో ఈ క్యారెక్టర్ ట్రై చేయడానికి ఓ శాంపిల్ గా వేసాడేమో గానీ, శిరీష్ బ్రాహ్మణ లుక్ కు టైటిల్ కూడా ఖరారు చేసారు. “బ్రదర్ ఆఫ్ దువ్వాడ జగన్నాధమ్” టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తే సరిగ్గా సరిపోతుందన్నది నెటిజన్ల మాట. మరి మీరేమెంటారు…!

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories