జగన్ ‘మావిగన్’ కోసం మరి బిఆర్ఎస్.?

Jagan, KTR Pin Hopes on Padayatras Before Elections

రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ రెండు పార్టీల మధ్య రాజకీయ భావసారూప్యత స్పష్టంగా కనిపిస్తుంది. అందులో ఒకటి ఏపీ లో వైసీపీ కాగా రెండవది తెలంగాణలో బిఆర్ఎస్. అయితే ప్రత్యేక తెలంగాణ లక్ష్యంగా బిఆర్ఎస్ ఆవిర్భవిస్తే, ఉమ్మడి ఏపీ నినాదంతో వైసీపీ ముందుకెళ్లింది.

గతంలో ఈ రెండు పార్టీల రాజకీయ విధానాలు పూర్తి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ 2014 ఎన్నికలలో ఏపీలో టీడీపీ గెలుపు, బాబు ముఖ్యమంత్రి పదవి వీరిద్దరిని ఒక్కటి చేసింది. నాటి నుంచి నేటి వరకు వైసీపీ లో ఏర్పడిన రాజకియ పరిస్థితులే బిఆర్ఎస్ కి ఎదురవుతున్నాయి.

ADVERTISEMENT

బిఆర్ఎస్ రాజకీయంగా చెల్లిస్తున్న మూల్యాలను ఇటు వైసీపీ కూడా తూచా తప్పకుండా అనుసరిస్తుంది. వైసీపీకి షర్మిల రూపంలో ఎదురైన గండం బిఆర్ఎస్ కి కవిత రూపంలో ఎదురొచ్చింది. అలాగే 2023 లో బిఆర్ఎస్ ఓటమి 2024 లో వైసీపీ పరాజయాన్ని ముందుగానే నిర్దేశించింది.

ఇక ఈ రెండు పార్టీల రాజకీయ ఎంజెండా టీడీపీ పతనం, బాబు వినాశనం. ఇందుకోసం ఈ రెండు పార్టీల నేతలు రెండు రాష్ట్రాల మధ్య ప్రాంతీయవాద విద్వేషాలు రెచ్చకొట్టేందుకు, సృష్టించేందుకు వెనుకాడరు అనేది అనేక అంశాలతో ఇప్పటికే నిరూపితమయ్యింది.

అయితే అటువంటి భావసారూప్యత ఉన్న ఈ రెండు రాజకీయ పార్టీలు రాబోయే ఎన్నికల కోసం పాదయాత్రలకు సిద్ధమయ్యారు. వైసీపీ 2.0 కోసం జగన్ పాదయాత్ర మొదలుపెడతా అంటూ ప్రకటించగా, కేసీఆర్ ని మరోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు కేటీఆర్ పాదయాత్ర చేస్తానంటూ పార్టీ శ్రేణులకు హామీ ఇచ్చారు.

ఈ ఇద్దరు నేతలు ఇప్పటికే తమ తమ పార్టీ శ్రేణులకు తమ పాదయాత్ర పట్ల ఒక స్పష్టమైన అభిప్రాయాన్ని వెళ్లబుచ్చారు. అయితే 2029 వైసీపీ ఎన్నికల నినాదం మావిగన్ అంటూ జగన్ ఇప్పటికే ప్రకటించేసారు, ఆ దిశగా పార్టీ నేతలను, పార్టీ క్యాడర్ ని మావిగన్ కోసం సిద్ధం చేస్తున్నారు.

మరి తెలంగాణ లో ముచ్చట గా మూడోసారి సీఎం అయ్యేందుకు రెడీ గా ఉన్న కేసీఆర్, కేసీఆర్ ని ముఖ్యమంత్రిని చేసేందుకు నడుంబిగించింది కేటీఆర్ తన పార్టీ శ్రేణులకు ఏ నినాదం తో దిశా నిర్దేశం చేస్తారు. సీఎంగా రేవంత్ రెడ్డి పునాదులేస్తున్న ఫ్యూచర్ సిటీ కి ఇక ఫ్యూచర్ ఉండదు అనే నినాదం తో ముందుకొస్తారా.? లేదా రేవంత్ తెరమీదకు తెచ్చిన హైడ్రాను బుల్డోజర్లతో ధ్వంశం చేస్తామంటూ ముందుకెళ్తారా.?

ADVERTISEMENT
Latest Stories