వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా ‘ఒక్క క్షణం’ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. విభిన్నమైన కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా గతంలో వచ్చిన కొరియన్ సినిమా ‘ప్యారలల్ లైఫ్’ను స్ఫూర్తిగా తీసుకుని చేశారనే ప్రచారం జరుగుతోంది.
‘ప్యారలల్ లైఫ్’ రీమేక్ హక్కులను తీసుకున్న నిర్మాత అనిల్ సుంకర, ‘2 మేమిద్దరం’ సినిమాను నిర్మిస్తున్నాడు. ‘ఒక్క క్షణం’ అదే కాన్సెప్ట్ తో వస్తుండటంతో, ఆయన ఫిల్మ్ ఛాంబర్లో ఫిర్యాదు చేసినట్టుగా ట్రేడ్ టాక్. ఈ నేపథ్యంలో అల్లు శిరీష్ స్పందిస్తూ… కొరియన్ సినిమా ‘ప్యారలల్ లైఫ్’ తాను చూశానని అన్నాడు.
కంటెంట్ పరంగా ఆ సినిమాకి .. తమ సినిమాకి ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. తమ సినిమా విడుదలైన తరువాత ఈ విషయం తెలుస్తుందని స్పష్టం చేశాడు. అల్లు శిరీష్ కెరీర్ లో పాజిటివ్ వైబ్రేషన్స్ తో విడుదల అవుతోన్న ఈ సినిమా నూతన సంవత్సర కానుకగా ఈ నెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.



