ట్రైలర్ టాక్ – హిట్టు కళలు కనపడుతున్నాయ్!

Srirastu Subhamastu Trailer Review, Srirastu Subhamastu Movie Trailer Review, Allu Sirish Srirastu Subhamastu Trailer Review, Lavanya Srirastu Subhamastu Trailer Review, Srirastu Subhamastu Theatrical Trailer Review అల్లు అర్జున్ సోదరుడిగా సిల్వర్ స్క్రీన్ కు పరిచయమైన శిరీష్, మొదటి సినిమా ‘గౌరవం’ నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఎక్స్ ప్రెషన్ లేని ఫేస్ గా సినీ విమర్శకులు తీవ్రంగా విమర్శించిన నేపధ్యంలో తాజా చిత్రం “శ్రీరస్తు శుభమస్తు”తో విమర్శకులకు బదులు చెప్పాలని భావించినట్లుగా కనపడుతోంది. పూర్తిగా మేకోవర్ అయిన శిరీష్, ప్రస్తుతం ఈ సినిమా ధియేటిరికల్ ట్రైలర్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే పని పడ్డాడు.

ADVERTISEMENT

‘సోలో’ ఫేం పరశురాం దర్శకత్వం వహించిన ఈ సినిమాను గీత ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. సొంత సినిమా కావడంతో నిర్మాణ విలువలు అద్భుతంగా ఉండగా, ట్రైలర్ లో మొదట ఆకట్టుకునేది హీరోయిన్ లావణ్య త్రిపాఠి అభినయం. అల్లరి పిల్లగా ప్రస్తుత యువతరం ఆలోచనలకు అనుగుణంగా ప్రసంగించే లావణ్య డైలాగ్స్ యూత్ కు బాగా కనెక్ట్ అవుతాయి. ట్రైలర్ ఫస్టాఫ్ లో లావణ్య చెప్పిన డైలాగ్స్ కు, సెకండాఫ్ లో శిరీష్ రివెంజ్ తీర్చుకుంటున్నట్లుగా సాగిన విధానం వీక్షకులకు వినోదాన్ని పంచుతోంది.

హీరోహీరోయిన్ల లుక్స్, సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ సంగీతం, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ “శ్రీరస్తు శుభమస్తు” హీరోగా అల్లు శిరీష్ కు మొదటి బ్రేక్ ఇచ్చేదిగా కనపడుతోంది. కొత్తదనం లేకపోయినా… ట్రైలర్ ఆద్యంతం వినోదభరితంగా సాగడం ప్రధాన ప్లస్ పాయింట్.

ADVERTISEMENT
Latest Stories