amabati-rambabu-avanti-srinivas

వైసీపీ ఓటమికి ఈవీఎం లను నిందిస్తూ ఇన్నాళ్లు కాలక్షేపం చేసిన వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా నిజాన్ని అంగీకరిస్తున్నారు. వాస్తవాన్ని ఒప్పుకుంటున్నారు. ఇందులో ముఖ్యంగా గత ఐదేళ్లు నోటికి తప్ప బుద్ధికి పని చెప్పని మాజీ మంత్రి, ప్రత్యర్థులను వెటకారం చేయడం తప్ప పని చేయడం చేతకాని అంబటికి నేటికీ తత్త్వం బోధపడినట్టు కనిపిస్తుంది.

తాజాగా మాజీ మంత్రి అంబటి తన ఓటమిని అంగీకరిస్తూ వైసీపీ శ్రేణులతో చేసిన మాట మంతి కార్యక్రమంలో భాగంగా అయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జగన్ మోహన్ రెడ్డి రాజకీయాలలోకి రాకముందు నుంచి రాజకీయాలలో ఉన్న వ్యక్తిని నేను, కానీ ఇప్పుడున్న పరిస్థితులలో నాలాగా కేవలం మాటలు చెప్పి పని చేయకుండా ఉంటే కుదరదు.

Also Read – ఈ విందుని జగన్‌ జీర్ణించుకోలేరేమో?

నేను కూడా గత ఐదేళ్లు మీడియా ముందుకొచ్చి అనర్గళంగా ఉపన్యాసాలు ఇచ్చాను, కానీ ఫలితం చూస్తే 28 వేల ఓట్ల తేడాతో ప్రత్యర్థి పార్టీ నేత చేతిలో ఓడిపోయాను. 2014 ఎన్నికలలో నేను కేవలం 924 ఓట్ల తేడాతో ఓడిపోయాను. అందుకు గాను నాకు చాల రోజులు నిద్రపట్టెది కాదు, కానీ ఈసారి అలాకాదు, ఓడిపోయినా హాయిగా పడుకున్నా. ఎందుకంటే 28 వేల ఓట్లు తేడా అంటే ఇక మనం ఎం చేసినా గెలిచిచ్ఛచ్చేవాళ్ళం కాదులే అని అర్దమమయ్యింది.

అయితే ఇక్కడ ఒక్క విషయంలో కాస్త ఊరట దక్కింది, ఎందుకంటే నాకన్నా చాల మంది 90 వేలు, 80 వేలు, 70 , 50 ఇలా చాల వేల ఓట్ల తేడాతో ఓటమి చెందారు. కాబట్టి వారిని చూసి వాళ్ళ కన్నా నేను కాస్త పర్లేదు అని మనశాంతిగా ఉన్నాను అంటూ అంబటి చేసినా వ్యాఖ్యలు వైసీపీ యొక్క నిస్సహాయతను బయటపెట్టాయి. అయితే ఇదే దోవలో మరో వైసీపీ సీనియర్ నేత అవంతి శ్రీనివాస్ కూడా జగన్ ఒంటెదూ పోకడలను విమర్శిస్తూ పార్టీకి గుడ్ బై చెప్పారు.

Also Read – ప్రకృతి విపత్తులకు ఎన్‌డీఆర్ఎఫ్, జగన్‌ విధ్వంసానికి…

జగన్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు పార్టీని ఈ స్థాయి పతనానికి తీసుకు వచ్చాయి. అయినా కూడా పార్టీ అధిష్టానం తన వైఖరిని మార్చుకోకుండా ఇంకా అవే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతుంది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు మాసాలు కూడా పూర్తి చేసుకోకముందే ఇప్పుడే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమలు చేపట్టడం, ధర్నాలు, రస్తా రోకోలు అంటూ దూకుడు ప్రదర్శించడం సరి కాదు అంటూ వైసీపీ అధినేత జగన్ నిర్ణయాన్ని తప్పుబడుతూ వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు అవంతి.

Also Read – సైఫ్‌కి టాలీవుడ్‌ పరామర్శలు, ట్వీట్స్ లేవేంటి?


అయితే వైసీపీ నేతలలో వస్తున్న ఈ మార్పులు దేనికి సంకేతాలుగా మారనున్నాయో తెలియాలంటే మరికొన్నాళ్లు వేచి చూడాలి. మొత్తానికి ఓటమి అంబటి కి తత్త్వం బోధ పడేలా చేస్తే, అవాంతికి జ్ఞానోదయం అయ్యేలా చేసింది.