హీరోయిన్లపై వేధింపులు ఎక్కువవుతున్నాయ్!

Amala Paul alleges sexual harassment lodges complaintదక్షిణాది చిత్రాలలో రాణించిన హీరోయిన్ అమలాపాల్‌ తాజాగా లైంగిక వేధింపులకు గురైంది. ఈ మేరకు చెన్నైలోని మాంబళం పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. డాన్స్ స్కూల్ యజమాని, పారిశ్రామిక వేత్త అయిన అళగేశన్ తనతో అసభ్యంగా, అశ్లీల భావంతో మాట్లాడాడని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది.

ADVERTISEMENT

మలేసియాలో ఉన్న తన స్నేహితుడితో డిన్నర్ కు వెళ్లాలని కోరాడని ఈ ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అమలాపాల్ మాట్లాడుతూ, మహిళలకు రక్షణ లేకుండా పోతోందని, మాటలు, చేతలతో లైంగిక వేధింపులు అధికమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.

నిజానికి ఒక్క అమాలాపాల్ మాత్రమే కాదు, ఇటీవల కాలంలో హీరోయిన్లపై లైంగిక వేధింపుల పర్వం ఎక్కువవుతోంది. బహుశా అంతకుముందుతో పోలిస్తే… హీరోయిన్లు అన్నీ ఓపెన్ గా మాట్లాడుతుండడం కొంతవరకు దీనికి కారణం అవుతుందేమో గానీ, వారికి కూడా వ్యక్తిగత భావజాలం, స్వేఛ్చ ఉంటాయన్న విషయాలు మరిచిపోకూడదు కదా!

ADVERTISEMENT
Latest Stories