రోజుకో దాడి వార్తతో సోషల్ మీడియాలో వైసీపీ అనుచరుల దాష్టికాలను కళ్లారా చూస్తున్న ప్రజలకు సంజాయిషీ కానీ వైకాపా వారి బారిన పడిన బాధితులకు న్యాయం కానీ ప్రభుత్వ పెద్దల నుండి వస్తుందని ఆశించిన ప్రతి సారి డైవర్షన్ పోలిటిక్స్ తో ముందుకెళ్తున్న ఆ పార్టీ నేతలను చూస్తుంటే ఇంతకన్నా నా….అనిపించక మానదు.
నిన్నా మొన్న, వైకాపా అనుచరుల దాడులు సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్ అవ్వడంతో నష్టనివారణ చర్యలలో భాగంగా తమకు తమ పార్టీకి అలవాటైన విషయాన్ని పక్కదారి పట్టించే వార్తలతో మీడియా ముందుకొచ్చారు మంత్రి అంబటి. ఆయనకు ఖమ్మంలో ఎదురైనా నిరసనను రెండు కులాల మధ్య జరిగిన గొడవగా చిత్రీకరించడానికి కొంతమంది నాయకులను,కుల సంఘం నేతలను ఏసుకొని కుల పంచాయితీకి వచ్చారు మంత్రి గారు.
అక్కడ జరిగింది ఒకటి ఇక్కడ ఈయన సృష్టిస్తుంది మరొకటి. కేవలం రాష్ట్రంలో తమ పార్టీ నేతలు చేస్తున్న విధ్వంస ఖాండ ప్రజలలో చర్చలోకి రాకుండా చేయడానికి మంత్రి గారు ఇంతలా దిగజారాలా అంటున్నారు రెండు కులాలవారు. టీడీపీ – జనసేన పొత్తుని క్షేత్ర స్థాయిలో బలపడకుండా చేయడానికే వైసీపీ నేతలు ఇటువంటి కుట్రలకు పాల్పడతారని ఇరు పార్టీల నేతలు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
ఒకపక్క నిన్న కావలి సమీపంలో బస్సు డ్రైవర్ పై జరిగిన దాడి ఘటనలో బాధితులకు న్యాయం జరగక ముందే తాజాగా పీలేరు సంఘటన వెలుగులోకి వచ్చింది. మరి ఈ దాడిలో నిందితులు ఒకే సామజిక వర్గానికి చెందినవారే అయితే వారు ఏ అహంకారంతో బాధితుల మీద దాడి చేశారు? ఇక్కడ చర్చించాల్సింది అధికారం అనే అహంకారం తప్ప కులాలు కాదు.
అలాగే విజయనగరం జిల్లాలో తీవ్ర రైలు ప్రమాదం జరిగి పదుల సంఖ్యలోప్రజలు ప్రాణాలు కోల్పోయారు అలాగే వందల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు.ఇంతటి దయనీయమైన పరిస్థితులు రాష్ట్రంలో చోటుచేసుకుంటే వారికి తక్షణ సహాయ సహకారాలు అందించాల్సిన ప్రభుత్వ పెద్దలు నలుగురిని పోగేసుకొని ఈ కుల పంచాయితీలకు రావడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఆలోచించుకోవాలి.
తమను, తమ పార్టీ నేతలను అందలం ఎక్కించిన ప్రజల సమస్యలు గాలికొదిలేసి గాలి వార్తలు ప్రచారం చేసుకుంటూ మీడియా ముందు మీ యాగీ ఏందయ్యా అంటున్నారు టీడీపీ, జనసేన నేతలు. ఒక సంఘటనను ఇంతకన్నా దిగజార్చగలరా? అన్న ప్రతిసారి తమ అంచనాలకు అందకుండా దిగజారిపోతున్నావు అంబటి అంటున్నారు ఆయన సామజిక వర్గానికే చెందిన మరి కొందరు ముఖ్య నేతలు.




