వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు టిడిపి, వైఎస్ఆర్ కాంగ్రెస్ లకు పోటీగా ఎదగాలని అనుకుంటున్నందున పవన్ కళ్యాణ్ టిడిపితో కలిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ ను కూడా విమర్శిస్తున్నారని అన్నారు. ఈ రెండు పార్టీలకు చిత్తశుద్ది లేదని పవన్ అనడాన్ని తప్పు పడుతూ తమ పార్టీ ఎమ్.పిలు రాజీనామా చేస్తే , అవిశ్వాస తీర్మానం పెడితే, ఆరు రోజుల పాటు ఆమరణ దీక్ష చేస్తే చిత్తశుద్ది లేదని ఎలా అంటారని ఆయన అన్నారు.
పవన్ కళ్యాణ్ అలా మాట్లాడడం అన్యాయం, పాపం కూడా అని రాంబాబు వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి ఒక మూడవ శక్తి వచ్చినప్పుడు అధికార ప్రతిపక్షాలకు పోటీగా ఎదగాలని అనుకోవడం తప్పేమి కాదు. పవన్ కళ్యాణ్ జగన్ ను విమర్శిస్తే, జగన్ పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తారు. దాంట్లో కొత్తేమీ లేదు. రాజకీయాలలో అటువంటివి సర్వసాధారణం కూడా.
అలా కాకుండా విమర్శించడం పాపం అన్యాయం అంటే ఎలా? పొద్దున్న లేస్తూనే అంబటి, వాసిరెడ్డి పద్మ, రోజాలు చంద్రబాబు లోకేష్ లను అకారణంగా నిందిస్తూనే ఉంటారుగా. అది చాలదు అన్నట్టు తమ పేపర్ లోనూ టీవీలోనూ అదే పని చేస్తూనే ఉంటారుగా. అప్పుడు అన్యాయం పాపం అనిపించలేదా? తమకో న్యాయం అవతలి వారికో న్యాయం.



