పవన్ కళ్యాణ్ శత్రువు… ఇప్పుడు బీజేపీ మిత్రుడా?

BJP Amit Shah telangana tourబీజేపీ ప్రెసిడెంట్ అమిత్ షా రేపు హైదరాబాద్ రానున్నారు. బీజేపీ ఇటీవలే మొదలుపెట్టిన సంపర్క్ సే సమర్థన్ లో భాగంగా కొందరు ప్రముఖులను ఆయన కలిసి నాలుగేళ్ల బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించనున్నారు. దీనిలో భాగంగా ఈనాడు రామోజీ రావు, సైనా నెహ్వాల్, మరియు ప్రముఖ వ్యాపారవేత్త శ్రీనీ రాజులను కలవనున్నారు.

ADVERTISEMENT

గతంలో తన తల్లిని దూషించడానికి డబ్బులు ఖర్చుపెట్టి లోకేష్ తో కలిసి కుట్ర చేశారని పవన్ కళ్యాణ్ శ్రీనీ రాజు పై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దానితో శ్రీనీ రాజు ఆయనకు పరువు నష్టం నోటీసు కూడా ఇచ్చారు. ఈ క్రమంలో అమిత్ షా ఆయనను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అమిత్ షా తెలంగాణకు రానుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే యాత్రలతో పార్టీని బలోపేతం చెయ్యడానికి కృషి చేస్తున్న రాష్ట్ర బీజేపీకి ఆయన దిశానిర్దేశం చెయ్యనున్నారు. అమిత్ షా రాకతో కొన్ని ఇతర పార్టీ చేరికలు కూడా ఉండొచ్చని సమాచారం.

ADVERTISEMENT
Latest Stories