ఇదేనా రైతు పక్షపాతి ప్రభుత్వం?

Anantapur-Tomatoesఅసెంబ్లీలో కానీ బహిరంగ సభలలో గానీ ఊక దంపుడు ఉపన్యాసాలు ఇవ్వడంలో వైసీపీ నేతలు వారికి వారే సాటి. తమ ప్రభుత్వం రైతు పక్షపాతి… రైతన్నలను ఆదుకోవడానికి ఎన్నెన్నో సంక్షేమ పధకాలు, కార్యక్రమాలు చేపడుతున్నామని సిఎం జగన్మోహన్ రెడ్డి గొప్పగా చెప్పుకొంటారు. ఒకవేళ ఎక్కడైనా రైతులకు నష్టం కలిగితే వెంటనే తమకు తెలియజేస్తే క్షణాలలో వారి సమస్యలు మంత్రదండం తిప్పి మాయం చేసినట్లు మాయం చేసేస్తామని చెప్పుకొంటారు.

కానీ రాష్ట్రంలో టోమెటో ధరలు పడిపోవడంతో తమను ఆదుకోవాలని మూడు వారాలుగా రైతులు మొర పెట్టుకొంటున్నా ఏ మంత్రి, ఏ వైసీపీ ఎమ్మెల్యే కూడా పట్టించుకోలేదు. తత్ఫలితంగా ఒక్క అనంతపురం జిల్లాలో కక్కలపల్లి మార్కెట్ పరిసర ప్రాంతాలలోనే సుమారు 10,000 కేజీల టొమోటోలను రోడ్ల పక్కన పారబోసి రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ వెళ్ళిపోయారు. మార్కెట్‌లో దళారులు, వ్యాపారులు సిండికేట్ అవడంతో టోమెటో ధరలు 100 కేజీల ధర కేవలం రూ.10, 15 లుగా నిర్ణయించడంటో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎంతో కష్టపడి పండిస్తే కనీసం పంట పెట్టుబడి కాదు కదా… రవాణా ఛార్జీలు కూడా రాలేదని రైతులు కన్నీళ్ళు పెట్టుకొన్నారు.

ADVERTISEMENT

ఓ పక్క టోమెటో రైతులు నష్టపోతుంటే మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టోమెటో ధర కేజీ రూ.20-25 పలుకుతోంది. అయినా వంటలో టోమెటో తప్పదు కనుక కొని తీసుకువెళుతున్నారు.

రైతులు 100 కేజీలు రూ.10-15లకే అమ్ముకోలేక రోడ్లపక్కన పారబోస్తున్న వార్తలు టీవీలో చూసి ప్రజలు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సహాయపడి ఉంటే వారికీ, మాకు కూడా మేలు కలిగి ఉండేది కదా?అని అంటున్నారు. టోమెటో ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఏర్పాటు చేసి రైతులను ఆదుకొనే అవకాశం ఉన్నప్పటికీ జగన్ ప్రభుత్వం పట్టించుకోకుండా ఎంతసేపు బటన్ నొక్కుడు, గడప గడపకి అంటూ ఓట్ల వేటకే పరిమితం అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories