బుల్లితెరపై హాట్ బ్యూటీగా అలరించే ‘జబర్దస్త్’ బ్యూటీ అనసూయ, ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తోన్న విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన పిక్స్ ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఉంచుతూ హల్చల్ చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా తాను గత జన్మలో మత్స్యకన్యనేమో అంటూ ఓ ఫోటోను ఇంస్టాగ్రామ్ కు ఎక్కించింది.
బీచ్ పక్కన మోకాళ్ళపై కూర్చుని ఈ స్టిల్ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ‘నేను గత జన్మలో మత్స్యకన్యను అయ్యి ఉంటాను, కానీ మత్స్యకన్యలు అమరులని చెప్తుంటారు. అందులో నేను కూడా ఒక దానినా?’ అంటూ చమత్కరిస్తూ పోస్ట్ చేసిన ఈ పిక్ నెట్టింట సందడి చేస్తోంది. చక్కనమ్మ మత్స్యకన్య అవతారంలో అయినా అదిరిపోతుంది కదా!
Also Read – అసలే రోజులు బాలేవ్.. అమిత్ షాతో చంద్రబాబు ఏం చెప్పారో!