నెటిజన్ల హాట్ ప్రశ్నలు… యాంకర్ ఘాటు సమాధానం…!

Anchor Anasuya Replies To Social Mediaగోపీచంద్ మలినేని దర్శకత్వంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా సిద్ధమవుతోన్న “విన్నర్” సినిమాలో ‘జబర్దస్త్’ బ్యూటీ అనసూయ ఓ ఐటెం సాంగ్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల విడుదల చేసిన లిరికల్ వీడియోలోని అనసూయ హాట్ హాట్ ఫోటోలు చూపరులను ఆకర్షించాయి. అయితే ఈ పాటలో బుద్ధుడి విగ్రహం ముందు స్టెప్పులు వేయడంతో, నెటిజన్లు అనసూయపై ఓ రేంజ్ లో విమర్శలు చేశారు.

బుద్ధుడి విగ్రహం ముందు అర్ధనగ్నంగా డ్యాన్స్ చేయడం ఏమిటంటూ మండిపడ్డారు. ఈ ప్రశ్నలకు అనసూయ తనదైన శైలిలో ఘాటుగా సమాధానం ఇచ్చింది. ఈ పాటను ఉక్రెయిన్ లోని బుద్ధ బార్ లో చిత్రీకరించారని… ఆ బార్ లో బుద్ధుడి విగ్రహం ముందే అందరూ మందు తాగుతారని… బుద్ధుడి ముందు తాగడం తప్పు కానప్పుడు, మేము డ్యాన్స్ చేస్తే తప్పేంటని అనసూయ ప్రశ్నించింది.

ADVERTISEMENT

పాట కోసం తాము విగ్రహం పెట్టలేదని, బార్ లోనే ఆ విగ్రహం ఉందని… కావాలంటే గూగుల్ లో వెత్తుక్కోండని కాస్త గట్టిగానే స్పందించింది. ఇతరులను గౌరవించడం చేతకాని వారికి… దేవుడి గురించి మాట్లాడే అర్హత ఎక్కడుంటుందని, తనను ప్రశ్నించిన వారికి బదులిచ్చింది. ‘సోగ్గాడే చిన్నినాయనా, క్షణం’ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత ఈ ‘విన్నర్’లోనే అనసూయ తళుక్కుమంది.

ADVERTISEMENT
Latest Stories