మాజీ ఐఏఎస్ ఆఫీసర్లతో అమరావతిపై కుట్ర చేస్తున్నది ఎవరు?

Is IYR Krishna Rao Working Without Salary?ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై మరో మాజీ చీఫ్ సెక్రటరీ విరుచుకుపడ్డారు. ఇప్పటికే ఐవైఆర్ కృష్ణారావు ఆ వైపుగా పోతుంటే ఇప్పుడు అజయ్ కల్లమ్ కూడా ఆయనకు జత కలిశారు. తామేదో పెద్ద తాజ్‌మహల్‌ను నిర్మించి చరిత్రలో చిరస్థాయిగా నిలచిపోవాలనే పిచ్చితనం నుంచి పాలకులు దూరం కావాలని ఆయన హితవు పలికారు.

వారి పేరు కోసం ప్రజలు ఎన్నుకోలేదనే విషయాన్ని గుర్తించాలన్నారు. వీరి వ్యాఖ్యలలో ఉన్నది నిజమో కాదో అని తరికించే ముందు ఐఏఎస్ అధికారులు దేనికి అతీతులు కారని గుర్తించాలి. సమాజంలో వారిపై గౌరవం ఉన్నా వారి అభిప్రాయాలు కరెక్టు అవ్వాలని ఏమీ లేదు. అందరిలాగే వారికి అభిప్రాయాలు ఉంటాయి అవి ప్రభుత్వ అనుకూలం లేదా ప్రభుత్వ వ్యతిరేకత అవ్వొచ్చు.

ADVERTISEMENT

అయితే అసలు ప్రశ్న ఏంటంటే రిటైర్ అయ్యాక వారు చేస్తున్న వ్యాఖ్యలు పదవిలో ఉండగా ఏమయ్యాయి అని. అధికారులుగా వారికి పరిమిత పాత్ర ఉండొచ్చు అయితే ఆ పాత్ర మేరకు వారు వారి అభిప్రాయాన్ని చెప్పారా అనేది చూడాలి. కేవలం అప్పుడు ప్రభుత్వపెద్దల మెప్పు కోసమో లేక ప్రమోషన్ల కోసమో మాట్లాడకుండా ఉన్నట్టు అయితే అది ఆత్మవంచన ప్రజా ద్రోహం కాదా?

ఐవైఆర్ కృష్ణారావు, అజయ్ కల్లమ్ ఇద్దరు తాము పదవిలో ఉన్నప్పుడు అమరావతి గురించి ఎన్నో స్టేట్మెంట్లు, ఇంటర్వ్యూలు ఇచ్చిన వారే. ఐవైఆర్ అయితే రిటైర్మెంట్ తరువాత ప్రభుత్వం ఇచ్చిన నామినేటెడ్ పోస్టును ఆనందిచారు కూడా.. సరే ఉద్యోగధర్మం కోసం ఆత్మ వంచన చేసుకున్నారనే అనుకుందాం.

మరి ఏ రకంగా రిటైర్మెంట్ అయ్యాకా కూడా ప్రభుత్వం ఇచ్చిన నామినేటెడ్ పోస్టులను ఎంజాయ్ చేశారు. మొత్తానికి ఇదంతా చూస్తుంటే అమరావతి మీద ఒక పద్దతి ప్రకారం కుట్ర జరుగుతుందని, ఇటువంటి అధికారులు విమర్శలు చేస్తే ప్రజలను నమ్మించవచ్చని ఎవరో గట్టిగా భావించి వారిని ఉసిగొలుపుతున్నారని చాలా మంది భావన. అది నిజం కాదు అనడానికి కూడా అవకాశం ఉన్నట్టుగా కనిపించడం లేదు.

ADVERTISEMENT
Latest Stories