స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్ చేతులెత్తేసిందా.?

congress-planning-in-andhra-pradesh-local-elections

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అప్పుడే స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి సిద్ధమయ్యాయి. ఏకగ్రీవాలకు ఆస్కారం లేకుండా కూటమి మీద యుద్ధం చెయ్యాల్సిందే అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన పార్టీ క్యాడర్ కి లీడర్లకు ఒక స్పష్టమైన ఆదేశాలు జారీ చేసీసారు.

అలాగే ఇటు అధికార పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా ఎలా ముందుకెళ్ళాలనేదాని పై తీవ్ర కసరత్తు ప్రారంభించాయి. ఏ పార్టీ ఎక్కడ పోటీ చెయ్యాలి, ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే విషయంలో మూడు పార్టీల అధినేతలు కమిటీలతో చర్చలు మొదలుపెట్టారు.

ADVERTISEMENT

అలాగే పొత్తు ధర్మానికి కట్టుబడి మూడు పార్టీల కార్యకర్తలు, నాయకులు తమ ఉమ్మడి రాజకీయ ప్రత్యర్థి అయిన వైసీపీ ఓటమి కోసం శ్రమించాలని, అప్పుడే కూటమి మరింత బలంగా రాజకీయ అడుగులు వేయగలదు అంటూ టీడీపీ, జనసేన పార్టీలు తమ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తున్నాయి.

ఇటువంటి నేపథ్యంలో వైఎస్ షర్మిల నాయకత్వంలో రాజకీయం చేస్తున్న ఏపీ కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చెయ్యలేకపోయింది. కూటమికి వ్యతిరేకంగా, వైసీపీ కి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ బరిలోకి దిగుతున్నట్టుగా కానీ, కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టుగా కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు.

రాష్ట్ర విభజనతో ఏపీలో భూస్థాపితమైన కాంగ్రెస్ షర్మిల నాయకత్వంలో అయినా కాస్త వెలుగులోకి వస్తుంది అని భావించిన కాంగ్రెస్ అధిష్టానానికి అది అత్యాశగానే మిగిలిపోతుంది. 2024 ఎన్నికల ముందు వైఎస్ జగన్ టార్గెట్ గా షర్మిల చేసిన హడావుడి మొత్తం ఎన్నికల ఫలితాల తరువాత పూర్తిగా కనుమరుగయ్యిపోయిందనే చెప్పాలి.

అడపాదప తన ఉనికి తెలియచేయడానికి అటు వైసీపీ మీద ఇటు అధికార కూటమి మీద విమర్శలు, ఆరోపణలు చేస్తూ తిరిగి అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు షర్మిల. సుదీర్ఘ రాజకీయ, పాలనానుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం షర్మిల తప్పా మరో అవకాశం లేదు అన్నట్టుగా క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా దీనావస్థలోకి వెళ్ళిపోయింది.

వైసీపీ గెలుపు కోసం చంపడానికైనా, చావడానికైనా సై అంటూ వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీ క్యాడర్ ని రెచ్చకొడుతున్న తరుణంలో, కూటమి పొత్తు కోసం కాసేపు వ్యక్తిగత కొట్లాటలను, వ్యక్తిగత వివాదాలను పక్కనపెట్టి అందరు ఒకేతాటి మీదకొచ్చి 2024 సార్వత్రిక ఎన్నికల గెలుపు మాదిరి విజయాన్ని అందించాలంటూ మూడు పార్టీల అధినేతలు పిలుపునిస్తున్న నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ నుంచి..?

ADVERTISEMENT
Latest Stories