రెండు తెలుగు రాష్ట్రాలలో ఓటింగుకు సర్వసిద్ధం

Andhra-Pradesh-Telangana-MP-Electionsమరి కొన్ని గంటలలో రెండు తెలుగు రాష్ట్రాలలో ఓట్ల పండగ మొదలవ్వబోతుంది. ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలతో పాటు తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాల్లో ఎన్నికల ప్రక్రియకు ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. ఈవీఎంలు, వీవీప్యాట్‌లను ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాల్లో అధికారులు సిబ్బందికి అందజేశారు. వారిని భారీ పోలీసు బందోబస్తు మధ్య న్నికల సామగ్రితో తమకు కేటాయించిన పోలింగ్‌ బూత్‌లకు ప్రత్యేక వాహనాల్లో పంపించారు.

సమస్యాత్మకంగా ఉండే పోలింగ్‌ కేంద్రాల వద్ద మరింత భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలింగ్‌ ప్రక్రియను వెబ్‌కాస్టింగ్‌ ద్వారా అధికారులు పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇటీవలే ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ఫైనల్ ఓటర్ల జాబితా ప్రకారం ఓట్లు ఉన్న అందరూ ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. మొత్తం 3 కోట్ల 93 లక్షల 45 వేల 717 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ADVERTISEMENT

వీరిలో సుమారు 10 లక్షల మంది యువత తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రికార్డు స్థాయిలో 80% కి మించి ఓటింగ్ ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో తొలి సారిగా ఎన్నికల్లోనే వీవీ ప్యాట్లను వినియోగిస్తుంది ఎన్నికల సంఘం. అదే సందర్భంగా తొలిసారి బ్యాలెట్ యూనిట్లపై అభ్యర్థుల ఫొటోలను కూడా ముద్రిస్తోంది. ఎన్నికల ఫలితాల కోసం దాదాపుగా నెలన్నర అంటే మే 23వరకు వేచిచూడాలి.

ADVERTISEMENT
Latest Stories