ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ అమరరాజా గ్రూప్ కు మధ్య జరుగుతున్న వివాదం తెలిసిందే. కాలుష్యం మాటున ప్రభుత్వం టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు చెందిన కంపెనీని మూయించే ప్రయత్నం చెయ్యగా… ఆ కంపెనీ తమిళనాడుకు తరలిపోతుంది అనే వార్త మీడియాలో రావడంతో ప్రభుత్వం విమర్శల పాలయ్యింది.
మొదట్లో జగన్ కు అత్యంత అంతరంగికుడైన సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చి వాళ్ళు పోవడం కాదు మేమే దండం పెట్టి పొమ్మంటున్నాం అని చెప్పారు… అయితే ఆరు వేల కోట్ల పెట్టుబడి, పదహారు వేల మందికి ఉద్యోగాలు కలిపించే సంస్థ పై ప్రభుత్వ వైఖరి పై పెద్ద ఎత్తున విమర్శలు రావడం తో ప్రభుత్వం డిఫెన్స్ లో పడింది.
మరోవైపు… ఒక కంపెనీ ఈవెంట్ లో జయదేవ్ మాట్లాడుతూ… తాము ఎక్కడకు వెళ్లడం లేదని… అవన్నీ పుకార్లే. అలాంటి స్పెక్యులేషన్స్ మీద నేను స్పందించను.. అని చెప్పుకొచ్చారు. జయదేవ్ వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ ప్రత్యర్థి. పైగా ఈ మొత్తం ఉదంతంలో టీడీపీ, కమ్మ అనే కారణాల వల్లే ప్రభుత్వం కక్షసాధింపుకు దిగుతుందని ప్రజలలో బలమైన అభిప్రాయం ఉంది.
ఈ అవకాశాన్ని వాడుకుని గల్లా ఘాటైన విమర్శలు చేసి ఉండవచ్చు. కానీ ఆయన హుందాగా అటువంటి విషయాల్లోకి వెళ్ళలేదు. అయితే పాపం బులుగు మీడియాకు ఇది కూడా నచ్చలేదట. నీరో చక్రవర్తి లా ప్రభుత్వం పై బురద జల్లుతుంటే మీరు ఆ వార్తల్ని చూస్తూ ఎంజాయ్ చేసారా? అంటూ జయదేవ్ ని విమర్శిస్తున్నారు.
రాజకీయాలకు పోకుండా .. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చెయ్యకపోయినా ఇంకా ఏదో చెయ్యలేదు అనే ఆత్రం విడ్డూరం. అంటే వారు తిడితే పడాలి… కొడితే పడాలి… మౌనంగా భరిస్తే సరిపోదు… మమల్ని అసలు కొట్టలేదు అని చెప్పాలి. ఒకపక్క సజ్జల వంటి వారే ఓపెన్ గా ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తే జయదేవ్ మాత్రం ఇబ్బంది పడుతూ కూడా క్లీన్ చిట్ ఇవ్వాలట.
అసలు వివాదమే లేకపోతే కోర్టులో కేసులు ఎందుకు నడుస్తాయి? అది కూడా రాష్ట్రంలో ఏ పరిశ్రమతో లేని ఇబ్బంది ఒక్క అమర రాజాతోనే ఎందుకు? మంచి విషయంలో కూడా బూతులు వెతుక్కోవడమే వారికే చెల్లింది.



