తాను దర్శకత్వం వహించిన తొలి చిత్రం “ఘాజీ”తో భూఅంతర్భాగాన జరిగే కధతో సంచలనం సృష్టించిన సంకల్ప్ రెడ్డి, తాజాగా భూపై బాగాన గల ఆకాశంతో “అంతరిక్షం”ను అద్భుతంగా చూపించబోతున్నారని స్పష్టమైంది. వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి, అదితిరావులు ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా ఫస్ట్ టీజర్ విడుదల కాగా, ఫస్ట్ లుక్ లోనే ఆకాశం నుండి సంకల్ప్ పడేసారు.
[m9ad]
‘స్వీట్ అండ్ షార్ట్’గా ఉన్న ఈ టీజర్ లో విజువల్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. నిజంగానే అంతరిక్షంలో ఈ సినిమా షూటింగ్ చేసారేమో అన్న నాణ్యతను ప్రేక్షకులకు కలిగించడంలో చిత్ర యూనిట్ సఫలం కాగా, ప్రశాంత్ విహారి అందించిన నేపధ్య సంగీతం టీజర్ టెంపోను కొనసాగించింది. ‘ఇండియా ఈజ్ నాట్ గోయింగ్ టు లూజ్ దిస్’ అంటూ దేశభక్తిని కలిగించడంలోనూ సంకల్ప్ విజయవంతం అయ్యారు.
ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు క్రిష్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించడం విశేషం. జ్ఞానశేఖర్ ఫోటోగ్రఫీ అందించిన ఈ సినిమా ఇతర పాత్రల్లో శ్రీనివాస్ అవసరాల, సత్యదేవ్ తదితరులు నటించారు. డిసెంబర్ 21వ తేదీన టాలీవుడ్ తెరపై ఈ “అంతరిక్షం” ఆవిష్కృతం కాబోతోంది. ఈ ఏడాది ఫస్టాఫ్ లో ‘తొలిప్రేమ’ ద్వారా సక్సెస్ అందుకున్న వరుణ్ తేజ్, సెకండాఫ్ లో ‘అంతరిక్షం’తో పలకరించబోతున్నాడు.



