20 ఏళ్ల క్రితం “ప్రేమమ్” అనే మలయాళ సినిమాతో వెండితెరకి ఎంట్రీ ఇచ్చిన అనుపమ పరమేశ్వరన్ ఆ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి కుర్రాళ్ల గుండెల్లో చెరగని గుర్తుగా నిలిచింది. శతమానం భవతి తర్వాత సరైన సక్సెస్ అందుకోవడానికి కాస్త ఎక్కువ టైమ్ పట్టినా, ఆమె మాత్రం వరుసబెట్టి సినిమాలు చేస్తూనే ఉంది. మధ్యలో పంథా మార్చి, గ్లామర్ డోస్ పెంచి రౌడీ బాయ్స్, టిల్లు స్క్వేర్ లాంటి సినిమాలు చేసిన అనుపమ పరమేశ్వరన్ కు సక్సెస్ లు వచ్చినా, ఆమె ఇమేజ్ కి డ్యామేజ్ జరిగిందే కానీ పెద్దగా కెరీర్ కి హెల్ప్ అవ్వలేదు.
మధ్యలో కొన్నాళ్లు రిలేషన్ షిప్ అని, రీసెంట్ గా బ్రేకప్ అని వార్తల్లోకెక్కింది. బ్రేకప్ నుండి ఆమె బయటపడి, టాక్సిక్ రిలేషన్ షిప్ అంటే ఎలా ఉంటుంది అని వివరించి, చాలామంది అమ్మాయిలకి హెల్ప్ చేసిన విధానాన్ని చాలామంది కొనియాడితే, కొందరు మాత్రం అబ్బాయిని మరీ ఇంతగా కార్నర్ చేయాలా అని అనుపమను తిట్టినవాళ్లు కూడా లేకపోలేదు. అయితే.. అనుపమ బ్రేకప్ తర్వాత మలయాళంలో ఇచ్చిన ఒక పాడ్ క్యాస్ట్ లో బ్రేకప్ గురించి అబ్బాయిని కుదిరినంతలా బ్లేమ్ చేస్తూ చాలా పర్సనల్ విషయాలు షేర్ చేసుకున్న అనుపమ పరమేశ్వరన్.
తన రీసెంట్ రిలీజ్ “క్రేజీ కళ్యాణం” ప్రమోషన్స్ లో మాత్రం పీఆర్వో టీమ్ అండ్ తెలుగు మీడియా ఛానల్స్ కి చుక్కులు చూపించింది. ఫలానా వాటి గురించి ప్రశ్నలు అడగకూడదు అని ముందుగానే తన టీమ్ ద్వారా కొన్ని విషయాలు చెప్పించిన అనుపమ, ఒకవేళ ఇంటర్వ్యూలో ఏమైనా దొర్లితే అవి కట్ చేసేందుకు ఓ సహాయకుడిని కూడా ఇంటర్వ్యూల్లో పక్కనే ఉంచుకుంది. ఇదంతా సరిపోదన్నట్లు ఎవరైనా కాస్త కొత్త యాంకర్ కనిపిస్తే చాలు.. వాళ్లకి సమాధానం చెప్పడం మానేసి, ఫుల్లుగా ఆడేసుకుంది. దాంతో.. సాధారణంగా అందరికీ అనుపమ అంటే సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. కానీ.. ఈ హడావుడి పుణ్యమా అని అది పోయి ఈ అమ్మాయి ఏంటి ఇంతలా హడావుడి చేస్తుంది అని తిట్టుకునే స్థాయికి చేరింది.
చాలా ఆశలు పెట్టుకున్న “పరదా” ఫ్లాప్ అయ్యింది, అదే స్థాయిలో నమ్మిన “క్రేజీ కళ్యాణం” కూడా బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది. ప్రస్తుతం తమిళంలో వరుసబెట్టి సినిమాలు చేస్తున్న అనుపమ.. భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఆమె కెరీర్ మళ్లీ గాడిలో ఎప్పటికీ పడుతుంది? అనేది మాత్రం ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే.





