మూడేళ్ళలో ఏపీ ఎక్కడో… తెలంగాణ…

AP and Telangana Face Crucial 2029 Election Deadline

జమిలి ఎన్నికలు లేకపోతే ఆంధ్రప్రదేశ్‌లో మళ్ళీ 2029లో, ఓ ఆర్నెల్లు ముందుగా తెలంగాణలో శాసనసభ ఎన్నికలు జరుగుతాయి.

కనుక ఏపీ, తెలంగాణలో అధికార పార్టీలకు అదే డెడ్‌లైన్‌. ఆలోగా రెండు ప్రభుత్వాలు రాష్ట్రాలను అభివృద్ధి చేసి చూపాలి. సంక్షేమ పధకాలు అమలుచేయాలి. ప్రజలను మెప్పించేందుకు ఇంకేమైనా కూడా చేయగలిగితే చేసి చూపాలి.

ADVERTISEMENT

ఈ నేపధ్యంలో, రెండు రాష్ట్రాలలో జరుగుతున్న అభివృద్ధి పనులు, అమలవుతున్న సంక్షేమ పధకాలు, నెలకొన్న రాజకీయ వాతావరణం బేరీజు వేసుకొని చూస్తే, తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కంటే ఏపీలో కూటమి ప్రభుత్వం చాలా ‘సేఫ్ సైడ్’ ఉన్నట్లు చెప్పవచ్చు.

తెలంగాణలో సిఎం రేవంత్ రెడ్డి చాలా తెలివిగా పావులు కదుపుతున్నప్పటికీ బీఆర్ఎస్‌ పార్టీని కట్టడి చేయలేకపోతున్నారు. బీజేపి, బీఆర్ఎస్‌ పార్టీలు చేతులు కలిపే అవకాశం ఉందని కల్వకుంట్ల కవితే బయటపెట్టేశారు. కనుక వాటి నుంచి కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికలలో పెద్ద గండం పొంచి ఉంటుందనే భావించవచ్చు.

ఒకప్పుడు కేసీఆర్‌ హయంలో నిత్యం అభివృద్ధికి సంబందించిన వార్తలే వినిపించేవి. కానీ ఇప్పుడు కాంగ్రెస్‌-బీఆర్ఎస్‌ పార్టీ రాజకీయాల గురించే ఎక్కువ వినిపిస్తోంది.

ఇక ఏపీ గురించి చెప్పుకుంటే, సిఎం చంద్రబాబు నాయుడు చాలా మార్పులు స్పష్టంగా చూపగలిగారు. అమరావతి పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అక్కడే క్వాంటమ్‌ వ్యాలీ ఏర్పాటవుతోంది. అనేక ఉన్నత విద్యా సంస్థలు, యూనివర్సిటీలు కూడా వస్తున్నాయి.

ఈసారి సిఎం చంద్రబాబు నాయుడు కూడా రూటు మార్చి జగన్‌తో పోటీ పడుతున్నట్లు అనేక సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారు. అలాగే తరచూ ప్రజల మధ్యకు వెళుతూ ప్రజా సంబంధాలు కూడా బలపరుచుకుంటున్నారు.

రాజకీయంగా చూస్తే కూటమి ప్రభుత్వం చాలా బలంగా ఉంది. పార్టీల మద్య బంధం మరింత బలపడింది. టీడీపి మద్దతుపై కేంద్రం ఆధారపడి ఉన్నప్పటికీ సిఎం చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీతో స్నేహపూర్వకంగా, వినయంగానే మెసులుకుంటున్నారు.

కనుక రాష్ట్రానికి భారీగా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు, పరిశ్రమలు, ఐటి కంపెనీలు వస్తున్నాయి. వీటితో రాబోయే రెండు మూడేళ్ళలో లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వేలకోట్ల వ్యయంతో అనేక రోడ్, రైల్ ప్రాజెక్ట్ పనులు చకచకా జరుగుతున్నాయి.

తెలంగాణలో వరంగల్లో కొత్తగా మరో విమానాశ్రయం ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం ముప్పు తిప్పలు పడుతుండగా, ఏపీలో భోగాపురం విమానాశ్రయం 2026లో ప్రారంభం కాబోతోంది. రాష్ట్రంలో మరో అర డజను విమానాశ్రయాల ఏర్పాటుకి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

వైజాగ్, విజయవాడ మెట్రో కారిడార్ నిర్మాణ పనులకు చురుకుగా సన్నాహాలు జరుగుతున్నాయి. కనుక వచ్చే ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్‌ అన్ని విధాల అభివృద్ధి సాధించడం ఖాయం.

కానీ సిఎం చంద్రబాబు నాయుడు ఏవిదంగా దూసుకుపోతున్నారో జగన్‌ కనీసం గమనిస్తున్నట్లు లేదు. తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అన్నట్లు తనకు అలవాటైన ధోరణిలోనే ప్యాలస్‌ రాజకీయాలు చేస్తూ మళ్ళీ నేనే అధికారంలోకి వస్తాననే భ్రమలో ఉంటున్నారు. కనుక వచ్చే ఎన్నికల్లో ఏవిదంగా గెలవాలో జగనే ఆలోచించుకోవాలి తప్ప చంద్రబాబు నాయుడు… కూటమి కానే కాదు.

 

ADVERTISEMENT
Latest Stories