మే 7 వ తేదీ అర్దరాత్రి భారత్ దళాలు ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాక్ భూభాగంలోకి చొచ్చుకుపోయి మరీ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసి వచ్చాయి.
ఆ రోజు నుంచి పాక్ రెండు రోజుల పార్టీ భారత్‌పైకి డ్రోన్లు, క్షిపణులు, ఫైటర్ జెట్స్ పంపిస్తూనే ఉంది. కానీ వాటన్నిటినీ భారత్ దళాలు దీపావళి టపాకాయలు కాల్చినట్లు కాల్చి పారేశాయి.
ఆ తర్వాత భారత్ మరోసారి పాక్ ప్రధాన సైనిక, వాయుసేన కేంద్రాలపై క్షిపణులతో దాడి చేసి ధ్వంసం చేయడంతో పాక్ కాళ్ళ బేరానికి వచ్చిందని ప్రధాని మోడీ స్వయంగా చెప్పారు.
రష్యా ఉక్రెయిన్ దేశంతో గత మూడేళ్ళుగా యుద్ధం చేస్తూనే ఉంది కానీ నేటికీ ఓడించామని చెప్పలేకపోతోంది. పైగా ఈ యుద్ధం కారణంగా రష్యా ఆర్ధిక పరిస్థితి కూడా బాగా దెబ్బ తింది.
కానీ భారత్ ఆపరేషన్ సింధూర్‌తో మే 7న యుద్ధం ప్రారంభించి మే 10 వ తేదీకి ముగించేసింది. ఒకవేళ పాక్ యుద్ధం కొనసాగించాలనుకుంటే మరింత భయంకరంగా దాడులు చేస్తామని ప్రధాని మోడీ హెచ్చరించారు. కనుక పాక్ ఆ దుసాహసం చేయకపోవచ్చు.
ఈ యుద్ధంలో త్రివిధ దళాలు, వాటికి ఆకాశ్, ఎస్-400, బ్రహ్మోస్ వంటి గొప్ప అస్త్రాలు అందించిన శాస్త్రవేత్తలు, ఆపరేషన్ సింధూర్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాని మోడీ, వారికి అండగా నిలిచిన 140 కోట్ల మంది సమిష్టి విజయంగా దీనిని అభివర్ణించవచ్చు.
భారత్‌పై పాక్ దాడులు శేషనాగుపై చిట్టెలుకల సైన్యం దాడి వంటిదే అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభివర్ణించారు.
తమిళకవి తిరువాళ్ళవూర్ కవిత తిరుక్కురల్ నుంచి ఓ కవిత పంక్తిని కోట్ చేస్తూ, “ఎలుకలన్నీజేరి సముద్రము వలే ఘోషించినప్పటికీ ఏమి హాని జరుగుతుంది?శేషనాగు చేసే ఒక్క హుంకారం మాత్రం చేతనే అవన్నీ నశిస్తాయి.
భారతీయ గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థ ఎస్-400ని భీకరమైన శేషనాగుతో పోలుస్తూ, దానిపైకి దూకూతున్న పాక్ డ్రోన్లు మాడిమసైపోతున్న ఎలుకలుగా చూపారు. నిజమే కదా? పవన్ కళ్యాణ్ పోస్ట్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
An excerpt from Thiruvalluvaar’s ‘Thirukkural.’
763: ஒலித்தக்கால் என்னாம் உவரி
எலிப்பகை ? நாகம் உயிர்ப்பக்
கெடும்.Hindi : अगर (दुश्मन) चूहों की पूरी फौज भी समुद्र
की तरह गरजने का मिथ्याभास करने लगे,
तो भी वे… pic.twitter.com/5o4bdkrJMe— Pawan Kalyan (@PawanKalyan) May 12, 2025




