జగన్ ప్రభుత్వం చెయ్యకూడని అన్ని తప్పులూ చేసింది

Ashok Gajapathi Raju - TDP- ys Jagan- Sanchaitaమాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానం చైర్‌పర్సన్‌గా సంచయిత గజపతి నియామక జీవోను హైకోర్టు కొట్టివేసింది. కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజును పునర్నియమించాలంటూ ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. దీనిపై అశోక్ గజపతిరాజు కు ధర్మం గెలిచిందంటూ సామాజిక మాధ్యమాల్లో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

ADVERTISEMENT

ఈ మొత్తం ఎపిసోడ్ లో ప్రభుత్వం తన పరిధిని దాటిని వ్యవహరించిందని మొదటి నుండీ విమర్శలు వస్తూనే ఉన్నాయి. తెలుగుదేశం పోలిట్ బ్యూరో మెంబెర్ గా ఉన్న అశోక్ ని దెబ్బతీయడానికే వారి కుటుంబ కలహాలను ప్రభుత్వం వాడుకుంది. అశోక్ దివంగత సోదరుడి నుండి విడాకులు తీసుకున్న సతీమణి కుమార్తె (సంచయిత) ని తీసుకొచ్చి ఎవరూ లేని సమయంలో ప్రమాణస్వీకారం చేయించింది.

సంచయిత బీజేపీ నాయకురాలిగా ఉన్నా అశోక్ ని దెబ్బతీయడానికే అన్నట్టు ఆమెకు జగన్ మద్దతుగా నిలిచారు. అంతే కాక ఆమెతోనే అనేక విమర్శలు చేయించింది. మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానం కు సంబంధించిన నియమనిబంధనలను కూడా పట్టించుకోలేదు. ఆ రకంగా ప్రభుత్వమే రాజకీయాల కోసం కుటుంబ కలహాలతో తలదూర్చడం, అలాగే దేవుడి విషయంలో కూడా నిబంధనలు పాటించకపోవడం చేసి ఇప్పుడు కోర్టులలో అభాసుపాలు అయ్యింది. “జగన్ ప్రభుత్వం ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వం చెయ్యకూడని అన్ని తప్పులూ చేసింది,” అని టీడీపీ విమర్శిస్తోంది.

అయితే వివాదానికి ఇంతటితో ముగింపు పలికే ఉద్దేశం కూడా ప్రభుత్వానికి ఉన్నట్టుగా లేదు. “మాన్సాస్ ట్ర‌స్ట్‌పై హైకోర్టుతీర్పును స‌వాల్ చేస్తాం.. కోర్టు తీర్పు కాపీ పూర్తిగా చూడలేదు. దీనిపై అప్పీలుకు వెళతాం, మేం ఎక్క‌డా నిబంధ‌న‌లు ఉల్లంఘించ‌లేదు. తీర్పులు ఒక్కోసారి అనుకూలంగా, ఒక్కోసారిగా వ్యతిరేకంగా వస్తాయి,” అంటూ దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి మీడియాతో చెప్పుకొచ్చారు.

ADVERTISEMENT
Latest Stories