‘పెళ్లిచూపులు’ సినిమాతో బాగా పాపులర్ అయిన విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న “అర్జున్ రెడ్డి” సినిమా టీజర్ ను వాలైంటైన్స్ డే సందర్భంగా విడుదల చేసారు. హీరో ఇంట్రడక్షన్ ను ఇస్తూ తను చేసే పనులను చూపించిన విధానం ఆసక్తికరంగా సాగగా, ఆ తర్వాత కోపాన్ని మాత్రం మేనేజ్ చేయగలిగేవాడు కాదని సాగిన సన్నివేశాలు వినోదాన్ని పంచాయి.
విజయ్ దేవరకొండ ఈజ్ తో కూడిన యాక్టింగ్ ఆకట్టుకోగా, టీజర్ కు తగిన విధంగా రాడాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ సంగీతం వీక్షకులకు మంచి ఉత్సాహాన్ని ఇస్తుంది. వంగా సందీప్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈ ఏడాది సమ్మర్లో విడుదల చేస్తున్నట్లుగా ఈ టీజర్ లో చిత్ర యూనిట్ ధృవీకరించింది. చూడబోతుంటే… విజయ్ కెరీర్ లో మరో హిట్టు బొమ్మలా ఉండే పాజిటివ్ సంకేతాలను ‘అర్జున్ రెడ్డి’ కల్పించాడు.
ADVERTISEMENT
ADVERTISEMENT



