యథాప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం మరోసారి మొండిచేయి చూపింది. విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన నిధులు విడుదల విషయంలో కేంద్రం ఇంకా ఎటూ తేల్చడంలేదు. ఈ ఏడాది మార్చిలో మొత్తం ఏడు జిల్లాలకు విడుదల చేసిన 350 కోట్లను మోదీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.
[m9ad]
అంతకుముందు విడుదల చేసిన నిధులకు సంబంధించిన యూసీలు, ఖర్చుల వివరాలు అందించని కారణంగా వాటిని వెనక్కి తీసుకుంటున్నట్టు కేంద్రం గతంలో వెల్లడించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మార్చి నెలాఖరు కల్లా యూసీలు, ఖర్చుల వివరాలను అందించింది. ఆర్నెళ్లు గడుస్తున్నా ఈ నిధుల విడుదలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
అదే సమయంలో ఏపీతో పాటు పెండింగ్‌లో పెట్టిన తెలంగాణకు చెల్లించాల్సిన 450 కోట్ల నిధులను మాత్రం వారం రోజుల క్రితమే విడుదల చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు. అయితే, ఏపీ విషయంలో మాత్రం ఎలాంటి పురోగతి లేదని తేల్చి చెప్పారు. ఇది ఆంధ్రప్రదేశ్ పై నరేంద్రమోడీ వివక్షకు మరో నిదర్శనం అనుకోవాలి.



