గత కొన్ని సంవత్సరాలుగా టీమిండియా విజయాలు వెనుక కీలక పాత్ర పోషిస్తున్న క్రీడాకారుల్లో రవిచంద్రన్ అశ్విన్ ఒకరు. స్పిన్నర్ గా వికెట్లు తీయడమే గాక, కష్టకాలంలో బ్యాటింగ్ లోనూ ఆదుకుంటున్న అశ్విన్, తాజాగా ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సొంతం చేసుకున్నాడు. అలాగే ఆల్ రౌండర్స్ విభాగంలో ఐసీసీ నెంబర్ 1 స్పాట్ ను దక్కించుకున్నాడు. ఈ తరుణంలో తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంటూ కాసేపు చిట్ చాట్ నిర్వహించారు.
అందులో భాగంగా ఓ తెలుగు అభిమాని ‘మీ అభిమాన తెలుగు హీరో ఎవరు?’ అంటూ ఓ ప్రశ్న వేసారు. దానికి జవాబిచ్చిన అశ్విన్ యధావిధిగా ‘ప్రిన్స్ మహేష్ బాబు’ పేరు వెల్లడించారు. అయితే మరో విశేషం ఏమిటంటే… మహేష్ బాబు పేరుతో పాటు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పేరును కూడా అశ్విన్ ప్రస్తావించాడు. సాధారణంగా నాన్ – తెలుగు ప్రేక్షకులకు, సెలబ్రిటీలకు ఎక్కువగా తెలిసిన, పరిచయం ఉన్న పేరుగా ‘మహేష్ బాబు’ను తెలుపుతుంటారు. అయితే అశ్విన్ జాబితాలో బన్నీ కూడా ఉండడం విశేషం
@jasti281 Mahesh babu and Allu Arjun
— Ashwin Ravichandran (@ashwinravi99) December 22, 2016



