ఇప్పటికే శ్రీలంక జట్టును ఓడించి టోర్నీ నుండి అవుట్ చేసిన పసికూన ఆఫ్ఘనిస్తాన్ జట్టు, బుధవారం నాడు జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ కు కూడా షాక్ ఇచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్ 255 పరుగులు చేయగా, బంగ్లాను కేవలం 119 పరుగులకే ఆలౌట్ చేసి, టోర్నీలో హాట్ టాపిక్ గా మారింది. ఆఫ్ఘన్ టాప్ ప్లేయర్ రషీద్ ఖాన్ బ్యాటింగ్ లో 32 బంతుల్లో 57 పరుగులు చేసి గౌరవప్రదమైన స్కోర్ కు చేర్చగా, బౌలింగ్ విభాగంలోనూ 9 ఓవర్లకు కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు సొంతం చేసుకున్నాడు. ఆల్ రౌండ్ ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ను సొంతం చేసుకున్నాడు రషీద్.
[m9ad]
నేటి నుండి సూపర్ 4 మ్యాచ్ లు ప్రారంభం కానున్న నేపధ్యంలో ఆఫ్ఘన్ జట్టు ఎవరూ తేలికగా తీసుకునే అవకాశం లేకుండా పోయింది. నేడు ఇండియా – బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుండగా, శనివారం నాడు పాకిస్తాన్ తో ఆఫ్ఘనిస్తాన్ తలపడనుంది. దీంతో పాక్ కు కూడా కోలుకోలేని షాక్ ఇస్తుందేమో అన్న భావన సర్వత్రా నెలకొంది. అండర్ డాగ్స్ గా అడుగుపెట్టి, టాప్ లో ఉన్న ఒక్కో జట్టును మట్టికరిపిస్తున్న వైనం, ఖచ్చితంగా ఇతర జట్ల ప్రభావితం చూపనుంది. ఇండియా – ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ ఈ నెల 25వ తేదీన జరగబోతోంది.



