సాగునీటి పారుదల రంగంలో దేశంలో వచ్చిన నూతన ప్రాజెక్టులు – పెట్టుబడులపై ‘అసోచామ్’ జరిపిన అధ్యయనంలో తెలంగాణా నెంబర్ 1గా నిలువగా, ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో నిలిచింది. గత పదేళ్ల కాలం నుంచి వస్తోన్న పెట్టుబడులను ఆధారంగా తీసుకుని ఈ నివేదికను అసోచామ్ రూపొందించింది. దేశవ్యాప్తంగా సాగునీటి పారుదల రంగంలో వచ్చిన పెట్టుబడుల్లో 12 శాతం వాటాతో తెలంగాణ మొదటి స్థానంలో నిలిస్తే, 11శాతం వాటాతో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది.
దేశంలో 84 శాతం ప్రాజెక్టులు నిర్మాణ దశలోనే ఉన్నాయని, 113 ప్రాజెక్టుల్లో మాత్రమే పనులు కొనసాగుతున్నాయని పేర్కొంది. ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం మహారాష్ట్రలో 21 శాతం, కర్ణాటకలో 18 శాతం, ఏపీలో 14 శాతం, గుజరాత్‌లో 12 శాతం, తెలంగాణలో 9 శాతం పెరిగినట్లు తెలిపింది. ‘ఇరిగేషన్ డెవలప్‌మెంట్ అథారిటీ’లను ఏర్పాటు చేస్తే వ్యయభారం పెరగకుండా చూసుకోవచ్చని సూచనలు చేసింది.



